KADIYAM KAVYA: కడియం కావ్యకి అసమ్మతి సెగ.. టిక్కెట్ వద్దంటున్న BRS లీడర్లు

మాజీ మంత్రి కడియం శ్రీహరికి బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి ఆఫర్లు రావడంతో.. ఆయన ఎక్కడ పార్టీకి దూరం అవుతారో అన్న భయంతో కడియం కావ్యకు టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. దాంతో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరింది.

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 06:21 PM IST

KADIYAM KAVYA: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. ముఖ్యమైన నేతలంతా కారు దిగి పోతున్నారు. వరంగల్ పార్లమెంట్ టిక్కెట్‌ను కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఇవ్వడంపై అసంతృప్తి చెలరేగుతోంది. ఈ టికెట్ కోసం BRSలోని ముఖ్య నేతలు, ఉద్యమకారులు పోటీ పడ్డారు. కానీ మాజీ మంత్రి కడియం శ్రీహరికి బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి ఆఫర్లు రావడంతో.. ఆయన ఎక్కడ పార్టీకి దూరం అవుతారో అన్న భయంతో కడియం కావ్యకు టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. దాంతో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరింది.

Danam Nagender: అనర్హత వేటు తప్పదా? దానంకు 3 నెలలే గడువు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన BRSలో ఎంపీ సీట్లకు పోటీ చేయడానికి అభ్యర్థులే కరువైన పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కనిపించింది. కానీ వరంగల్ పార్లమెంట్ టికెట్‌పై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. తాటికొండ రాజయ్య, ఆరూరు రమేష్, సిట్టింగ్ ఎంపీ దయాకర్ టికెట్ కోసం ప్రయత్నించారు. వీళ్ళతో పాటు కొందరు తెలంగాణ ఉద్యమకారులు కూడా తమకి అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ వీళ్ళెవరికీ కాకుండా కడియం కావ్యను ఎంపిక చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. తాటికొండ రాజయ్య ఇప్పటికే పార్టీని వీడగా, దయాకర్ కాంగ్రెస్‌లోకి, ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమకారులు.. కావ్య అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేకంగా ఓ మీటింగ్ పెట్టి.. కేసీఆర్‌కు తమ నిరసన తెలపాలని డిసైడ్ అయ్యారు.

టికెట్టు ఇస్తే మాదిగ లేదా మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని, కానీ, మాదిగ ఉప కులానికి ఇవ్వడమేంటని కూడా ప్రశ్నించాలనుకున్నారు. మీటింగ్ పెడదామని అనుకునే లోపు.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం.. గులాబీ బాస్ బాధలో ఉండటంతో వెనక్కి తగ్గారు. వరంగల్ నుంచి కడియం కావ్యను తప్పించకపోతే సహకరించేది లేదని ఉద్యమకారులు అంటున్నారు. మరి ఈ అసంతృప్తి నేతలను కడియం శ్రీహరి ఎంతవరకు బుజ్జగిస్తారన్నది చూడాలి.