కాళేశ్వరం: ఐఏఎస్ అధికారులకు మూడిందా…?

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. ఇరిగేషన్ అధికారులు - కమిషన్ వేసిన కమిటీతో భేటీ కానున్న జస్టిస్ చంద్ర ఘోష్... కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నారు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 11:39 AM IST

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. ఇరిగేషన్ అధికారులు – కమిషన్ వేసిన కమిటీతో భేటీ కానున్న జస్టిస్ చంద్ర ఘోష్… కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికీ కమిషన్ కు NDSA – విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ అందలేదు. తుది రిపోర్టులు అందకపోవడం పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇప్పటికే NDSA – విజిలెన్స్ కు పలు లేఖలు రాసిన కాళేశ్వరం కమిషన్… ఐఏఎస్ అధికారుల బహిరంగ విచారణ పై ఇవ్వాళ నిర్ణయం తీసుకోనుంది.

ఏ అధికారిని ఎప్పుడు పిలువాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. విచారణ పూర్తికానందున అక్టోబర్ 31 తో కమిషన్ గడువు ముగియటంతో మరో రెండు నెలలు పొడిగిస్తూ నవంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.