కాళేశ్వరం అధికారులను ముంచేసిందా…?

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలపై కాళేశ్వరం కమీషన్ సీరియస్ గా ఫోకస్ చేసింది. రేపటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. రేపటి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను పిలువాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - September 23, 2024 / 06:06 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలపై కాళేశ్వరం కమీషన్ సీరియస్ గా ఫోకస్ చేసింది. రేపటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. రేపటి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను పిలువాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. దాదాపు గా 40కి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్న కమిషన్… రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లను ప్రశ్నించనుంది.

రేపు కమిషన్ బహిరంగ విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుకు చెందిన 6 గురు ఇంజనీర్లు హాజరు అవుతారు. ఇంజనీర్ల విచారణ అనంతరం బ్యూరోక్రాట్స్ ను విచారించే అవకాశం ఉంది. ఈఎన్సి లను ఈ వారంలోనే విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని సైతం అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ప్లేస్మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారి చేసారు.

కాగ్ రిపోర్ట్ పై కాగ్ అధికారులను విచారణకు పిలుస్తున్నారు. కమిషన్ కు అఫిడవిట్ అండ్ తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలకు కమీషన్ సిద్దమైంది. డైరెక్టర్ గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నది కమిషన్. కమిషన్ ఇచ్చే పేర్లు ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది.