హీరోయిన్ జత్వాని కేసులో పోలీసులు కీలక అరెస్ట్ లకు రంగం సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు. ముద్దాయిలు గా ఐపీఎస్ అధికారులను చేర్చారు పోలీసులు. మొత్తం ఐదుగురిని ముద్దాయిలుగా చేర్చారు. ఐపిఎస్ లతో పాటుగా పలు ఆరెస్ట్ లకు సిద్దమైనట్టుగా సమాచారం. ముగ్గురు ఐపిఎస్ అధికారులు, ఒక ఐవోతో పాటు విద్యాసాగర్ ని ముద్దాయిగా చేరుస్తూ రిమాండ్ రిపోర్ట్ సిద్దం చేసారు. దీనితో కాంతి రాణా టాటా హైకోర్ట్ కి వెళ్ళారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేసారు.
పోలీసులు అరెస్టు చేయాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ముందస్తు బెయిల్ కోరిన రాణా.. ప్రభుత్వం ఏకపక్షంగా సస్పెండ్ చేసిందని ఆయన కోర్ట్ కి వివరించారు. విచారణకు సహకరించి కోర్టు షరతులకు లోబడి ఉంటాను బెయిల్ ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారమే జేత్వనీ అరెస్ట్ జరిగింది అని కాంతి రానా తరుపు లాయర్ కోర్ట్ కి తెలిపారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారిపై ఫాల్స్ కేస్ పెట్టారు అని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ తరుణంలో ఏపీ హైకోర్టులో నటి జత్వానీ మరో పిటిషన్ దాఖలు చేసారు.
ఐపీఎస్ అధికారి కాంతిరాణా ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై కోర్ట్ విచారణకు అనుమతించింది. ఇదిలా ఉంచితే ఈ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిని నటి జేత్వాని కేస్ లో విద్యా సాగర్ కు రిమాండ్ విధించింది కోర్ట్. 4 వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. వైద్య పరిక్షల అనంతరం విజయవాడ సబ్ జైల్ కు తరలించారు. జేత్వనీ కేసులో ఏ1 1 ఉన్న విద్యాసాగర్ పై మరో కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం డెహ్రాడూన్ లో విద్యాసాగర్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై రాత్రి విజయవాడకు విద్యా సాగర్ ను పోలీసులు తీసుకొచ్చారు.