Karnataka Victory: కర్ణాటక విజయం క్రెడిట్‌ రాహుల్‌దే.. ఫలితాలపై భారత్‌ జోడో ప్రభావం ఎంత?

కర్ణాటకలో కాంగ్రెస్‌కు అద్భుత విజయం దక్కింది. పక్కా మెజారిటీ సాధించింది. దీంతో నెక్ట్స్ సీఎం ఎవరు అనే దానిపై రకరకాల చర్చ సాగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ భారీ విక్టరీ వెనక రకరకాల కారణాలు వినిపిస్తున్నా.. కామన్‌గా అందరూ చెప్తున్న పేరు మాత్రం ఒక్కటే.. అదే రాహుల్‌ గాంధీ ! నిజమే కూడా ! విభేదాలు, వివాదాలు.. విమర్శలు, పార్టీలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు.. పార్టీ పరిస్థితి ఏంటా అని కాంగ్రెస్‌ కార్యకర్త దిక్కులు చూస్తున్న సమయంలో ఓ అడుగు పడింది.

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 02:15 PM IST

ఆయన పాదం సైజు చిన్నదే కావొచ్చు.. చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు. ఆయన నడక పార్టీకి వేగం నేర్పింది. ఆయన మాట.. అందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చింది. అందుకే ముమ్మాటికి కాంగ్రెస్ విజయం అంతా రాహుల్‌ క్రెడిట్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు మాత్రమే కాదు.. రాహుల్‌ నాయకత్వానికి కూడా పరీక్షగా నిలిచాయ్. మొదటి అడుగు అద్భుతంగా వేశాడు రాహుల్. ఏ ముహూర్తాన భారత్‌ జోడో అంటూ జనాల్లో ఉండేలా యాత్ర ప్లాన్ చేశారో కానీ.. కాంగ్రెస్‌ ఫేట్ మారినట్లు కనిపిస్తోంది. జనంలో ఉంటే.. జనంతో ఉంటే.. ఆ ఫలితం రాక్‌ సాలిడ్‌గా ఉంటుంది అనడానికి కర్ణాటక ఫలితాలే ఎగ్జాంపుల్‌.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లు గెలిచింది అన్నది కాదు మ్యాటర్‌.. ప్రతీ గెలుపు వెనక రాహులే ఉన్నాడు. జనం ఆయన మీద చూపించిన ప్రేమే ఉన్నది అన్నది మాత్రం క్లియర్. కర్ణాటకలో రాహుల్ యాత్ర మొదలుపెట్టినప్పుడు రకరకాల అనుమానాలు వినిపించాయ్. యాత్ర సక్సెస్ అవుతుందా లేదా.. నేతలంతా కలిసి వస్తారా లేదా అని ! కానీ రాహుల్ మీద జనం కొండంత ప్రేమ చూపించారు. జనంతోనూ రాహుల్ అలానే కలిశారు. వాళ్లలో ఒకరిగా ఉన్నారు. ఇంట్లో ఒకడిగా మాట్లాడారు. నేల మీద కూర్చొని.. సామాన్య జనం పెట్టిన తిండి తిన్నారు. ఓటర్లు కాదు కాదు జనాల మనసు గెలిచారు. ఆ ప్రభావమే ఇప్పుడు కర్ణాటక ఫలితాల్లో కనిపించింది.

రాహుల్ యాత్రకు ముందు కర్ణాటక కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉండేది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య.. ఎవరికి వారు గ్రూప్‌లుగా విడిపోయి రాజకీయం చేశారు. ఈ విభేదాలు కాంగ్రెస్‌ను దెబ్బతీస్తాయనుకుంటున్న సమయంలో.. రాహుల్ పరిష్కారం చూపించారు. ఇద్దరి మధ్య శాంతిపూర్వక వాతావరణం తీసుకువచ్చారు. సయోధ్య కుదిర్చారు. కలిసి పనిచేసేలా స్ఫూర్తినిచ్చారు. జనంలో ఉంటూ.. జనంతో ఉంటూ.. జనాలను కలుస్తూ.. నేతలను కలుపుతూ.. పార్టీని ముందుకు నడిపించారు రాహుల్. శివకుమార్‌ అన్నా.. ఇంకెవరో అన్నా.. కర్ణాటక విజయం అంతా రాహుల్‌కే దక్కుతుంది అన్నది మాత్రం క్లియర్‌.