లిక్కర్ స్కాం కేసులో జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాన్నాళ్ళకు బయటకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఆమె నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కవిత. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఢిల్లీలో ఎయిమ్స్ లో గతంలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడి అయింది. ఈ ఆరోగ్య పరిక్షల అనంతరం కవిత కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం కవిత ప్రజల్లోకి వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి.