కవితకు బెయిల్: 2020 నవంబర్ 30 టూ 2024 ఆగస్ట్ 27 వరకు ఏం జరిగింది…?

  • Written By:
  • Publish Date - August 27, 2024 / 01:36 PM IST

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో 165 రోజుల పాటు కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కాం లో ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. మహిళలకు ఉండాల్సిన హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్ట్ ధర్మాసనం అభిప్రాయపడింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీం కోర్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఒక్కసారి లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ క్రమాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే…

2022, 25 నవంబరున మద్యం స్కాంలో 7 గురిని నిందితులుగా చేర్చుతూ ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 30 నవంబరున ఈడీ రిమాండ్‌ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు అంటే 1 డిసెంబరున ఉద్దేశపూర్వకంగానే ఈడీ తన పేరు చేర్చిందని కవిత ఆరోపణలు చేసారు. మరో రెండు రోజుల తర్వాత 3 డిసెంబరు: డిసెంబరు ఆరో తేదీ విచారణకు రావాలని కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అనంతరం 5 డిసెంబరున సమావేశాలు ఉన్నందున విచారణకు హాజరుకాలేనని కవిత సమాధానం ఇచ్చారు. డిసెంబరు 11నుంచి 15 మధ్య అందుబాటులో ఉంటనని వివరణ ఇచ్చారు.

11 డిసెంబరున కవితను ఆమె ఇంటివద్ద దాదాపు 7 గంటల పాటు విచారించారు. 12 డిసెంబరున కవిత కు సంబంథించిన రవాణా, ఫోను, హోటల్‌ బిల్లులను సమర్పించాలని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. 21 డిసెంబరున ఈడీ ఛార్జిషీట్‌లో కవిత పేరు చేర్చారు. ఇండోస్పిరిట్‌ కంపెనీలోను ఆమెకు వాటా ఉందని అభియోగం మోపగా కవిత ఖండించారు. 2023. 3 జనవరి నాడు కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును విచారించి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల తర్వాత అంటే 8 ఫిబ్రవరిన బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్నారు.

11 ఫిబ్రవరిన మరో నిందితుడు మాగుంట రాఘవ రిమాండ్‌ రిపోర్టులో కవిత పేరు ప్రస్థావనకు రాగా 8 మార్చిన కవితను 9న విచారణకు రమ్మని ఈడీ సమన్లు జారీ చేసింది. 11 మార్చిన దాదాపు 9 గంటలపాటు సుదీర్ఘంగా కవితను ఈడీ అధికారులు విచారించారు. 20, 21 మార్చిన పది గంటలకు పైగా కవితను విచారించారు. 12 ఏప్రిల్‌ న మద్యం కేసులో కవిత పేరును మరో నిందితుడు సురేష్ ప్రస్తావించారు. 29 ఏప్రిల్‌ న అప్రూవర్‌గా బుచ్చిబాబు మారిన దగ్గరి నుంచి కథ కొత్త మలుపులు తిరిగింది.

1 మేన ఈడీ ఛార్జిషీట్‌లో కవితపై మద్యంతో పాటు కొన్ని భూ సంబంథిత కేసులను ప్రస్తావించారు. ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 30 మేన ఛార్జిషీట్‌లో కవితపేరు చేర్చారు. 14 సెప్టెంబర్‌ న కవితకు ఈడీ సమన్లు జారీ చేయగా… 15 సెప్టెంబరున 26 సెప్టెంబర్‌ వరకు కవితకు సమన్లు పంపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 26 సెప్టెంబరున నవంబరు 20 వరకు కోర్టు ఆదేశాలు పొడిగించింది. 2024. 15 జనవరి నాడు విచారణకు రావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేయగా 16 జనవరిన సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగా విచారణకు హాజరుకాలేనని కవిత సమాథానం ఇచ్చారు. 5 ఫిబ్రవరిన సమన్లను ఫిబ్రవరి 16 వరకు పంపొద్దని సుప్రీంకోర్టు విచారణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 25 ఫిబ్రవరిన కవితకు ఈడీ సమన్లు ఇచ్చి 26 ఫిబ్రవరిన కవితను విచారించింది ఈడీ. 15 మార్చిన కవితను హైదరాబాద్‌లోని ఇంటి వద్ద అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు.