తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు ప్రరంభమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన మొదటి సారిగా 39 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రతిపక్షం లోకి వచ్చింది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేవం జరిగింది. ఈ సారి కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పక్షనేతగా మాజీ సీఎం కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
విపక్ష నేతగా ఉండేదుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారా..?
శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును బాన్సువాడ శాసనసభ్యుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దాన్ని బలపరిచారు. శాసససభాపక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
గత కొన్నిరోజులుగా.. శాసనసభాపక్ష నేతగా.. కేటీఆర్, హరీష్ రావులు/కడియం శ్రీహరీ ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సారి శాసనసభ్యుల్లో 119 మంది సభ్యులకు గాను బీఆర్ఎస్ తరఫున 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇందులో బలమైన ప్రతికక్షంగా బీఆర్ఎస్ అవతరించిన నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేత కు కేబినెట్ హోదా దక్కుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, శాసనసభా పక్ష నేతగా హరీశ్ రావుకు చెరో పదవి అప్పగిస్తారని బీఆర్ఎస్ లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి.