KCR in AP: కాపు ముఖ్యమంత్రి అంటూ ఏపీలో ఎత్తులు.. నిన్ను నమ్మం కేసీఆర్ అంటున్న జనాలు

దళిత ముఖ్యమంత్రి అంటూ తెలంగాణలో హడావుడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే డ్రామా.. కొత్త స్క్రీన్‌ప్లేతో మొదలుపెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది. ముందు అనుకున్న సామెతను ఇప్పుడు పదే పదే అనుకుంటోంది అందుకే !

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 04:09 PM IST

కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని అన్నాడట ! కేసీఆర్‌ మాటను.. కేసీఆర్ విషయంలోనే పదేపదే చర్చించుకుంటున్నారు కొందరు రాజకీయంలో ! సామెతతో సంబంధం లేకపోయినా.. పరిస్థితి మాత్రం అలానే ఉందని జోకులు వేసుకుంటున్నారు..

ఇదంతా ఎందుకు అంటే.. ఏపీలో అధికారంలోకి వస్తే.. తొలి ముఖ్యమంత్రి కాపు సామాజికవర్గ నేతే అని బీఆర్ఎస్ నుంచి ప్రకటన రాబోతోందని టాక్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటన చేసిన.. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయిన కేసీఆర్.. ఇప్పుడు అదే చీటింగ్ ఫార్ములానే ఏపీలో ఫాలో అవుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణలో దళితుడే తొలి ముఖ్యమంత్రి అని.. మాట నిలుపుకోకుంటే మెడకాయ మీద తలకాయ ఉండదని అప్పట్లో కేసీఆర్‌ చేసిన ప్రకటన.. రాజకీయవర్గాల్లో రేపిన సంచలన అంతా ఇంతా కాదు.

కట్ చేస్తే.. తెలంగాణ వచ్చింది.. రెండుసార్లు గులాబీ పార్టీ అధికారం దక్కించుకుంది.. కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు. దళిత ముఖ్యమంత్రి గురించి.. కేసీఆర్ మర్చిపోయారు.. జనాలు కూడా నెమ్మదిగా మర్చిపోతున్నారు. ఇప్పుడు అలాంటి రాజకీయమే.. ఏపీలోనూ చేయాలని కేసీఆర్ రెడీ అవుతున్నారు.. కాకపోతే సామాజికవర్గం మారింది అంతే !

తెలంగాణలో దళితులు అయితే… ఏపీలో కాపులు ! కాపు సీఎం సిద్ధాంతంతోనే.. ఆ సామాజికవర్గం నేతలకే బీఆర్ఎస్ గాలం వేస్తోందని తెలుస్తోంది. కాపు నేత అయిన తోట చంద్రశేఖర్‌కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకటించింది అందుకే ! త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. ఆ మీటింగ్‌లోనే సంచలన హామీలు ఉండబోతున్నాయని టాక్. అక్కడే కాపు ముఖ్యమంత్రి మంత్రాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారట ! ఆ ప్రకటనతో కాపు ఓటు బ్యాంకును సాధించాలని ప్లాన్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్.

దళిత ముఖ్యమంత్రి అంటూ తెలంగాణలో హడావుడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే డ్రామా.. కొత్త స్క్రీన్‌ప్లేతో మొదలుపెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది. ముందు అనుకున్న సామెతను ఇప్పుడు పదే పదే అనుకుంటోంది అందుకే !