KCR: కేసీఆర్‌లో కంగారు.. నేతలకు వరుస ఫోన్లు.. ఓటమి భయమా..? జాగ్రత్తా..?

ఒకవైపు వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే.. మరోవైపు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రతి రోజూ ఫోన్లు చేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సానుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషిస్తూ.. వారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 02:52 PM IST

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఎన్నికల కోసం హడావిడి పడుతున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికలను తేలికగా తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే గెలిచే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ వరుసగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు మీడియాకు అడిగి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

KCR-KTR: గులాబీ పార్టీలో ఓటమి భయం..? కేసీఆర్, కేటీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ..

గతంలో అపాయింట్‌మెంట్ దొరకడమే గగనమైన ఈ నేతలంతా ఇప్పుడు తమకుతాముగా ప్రజల దగ్గరకు, మీడియా సంస్థల వద్దకు వెళ్తున్నారు. యూట్యూబ్ ఛానెళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కీలక నేతలంగా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు ఉండటంతో.. మీడియా బాధ్యతలు హరీష్ రావు చూసుకుంటున్నారు. బీఆర్ఎస్‌పై వచ్చే విమర్శలను ఖండించడంలో హరీష్ రావు ముందుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా కేసీఆర్.. తన ఫోకస్ మొత్తం ఎన్నికలపైనే పెట్టారు. ఈసారి కూడా ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ స్వయంగా వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఒకవైపు వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే.. మరోవైపు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రతి రోజూ ఫోన్లు చేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సానుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషిస్తూ.. వారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

Nostradamus 2024: ప్రళయం తప్పదా? 2024లో భూమిని ముంచే భారీ సునామీ.. నోస్ట్రాడామస్ అంచనాలు నిజమవుతాయా?

సమన్వయంతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. వివిధ సర్వేలకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుని, అభ్యర్థులకు సలహాలిస్తున్నారు. పోలింగ్‌కు మరో వారం మాత్రమే గడువు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అన్నింటికీ మించి.. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్‌తో చర్చించారు. ఇదంతా గమనిస్తున్న ప్రత్యర్థులు.. కేసీఆర్‌లో కంగారు మొదలైందంటున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తూ, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ బలపడుతుండటంతో కేసీఆర్ తన శక్తిమేర ఎన్నికల కోసం ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో మరో రెండు వారాల్లో తేలనుంది.