KCR PLANT: కేసీఆర్ ఓడిపోవడం ఖాయమా.. ఎండిపోయిన మొక్క చెప్తోంది అదేనా..

నవంబర్‌ 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ యాగంలో పాల్గొంటూనే ప్రజా ఆశీర్వాద సభలకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత తన విశ్వాసానికి అనుగుణంగా మహాగని మొక్కను అడవి నుంచి తీసుకొచ్చి కొత్త సచివాలయం ప్రాంగణంలో నాటించారు.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 04:25 PM IST

KCR PLANT: రాజకీయాల్లో సెంటిమెంట్‌లు ఎక్కువగా ఉంటాయ్. కేసీఆర్ అయితే మరీ ఎక్కువ నమ్ముతుంటారు. అభ్యర్థుల ప్రకటన నుంచి తాను నామినేషన్‌ వరకు.. ప్రతీ విషయంలోనూ కేసీఆర్ ముహూర్తాలు చూశారు. పదేళ్లలో సీఎంగా చాలా యాగాలు నిర్వహించారు. ఆ యాగాలతోనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో పోలింగ్ కంప్లీట్ అయింది. ఇంకొన్ని గంటల్లో కౌంటింగ్‌ కూడా మొదలుకాబోతోంది. ఎగ్జిట్‌పోల్స్ టెన్షన్ పుట్టిస్తున్న వేళ.. ఎండిపోయిన ఓ మొక్క ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

Chandrababu Naidu: జనంలోకి చంద్రబాబు.. 10 నుంచి జిల్లాల పర్యటనలు

ఇదే సెంటిమెంట్‌గా మారింది కూడా. గత ఎన్నికల సమయంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించి ఫలితాలు పొందిన కేసీఆర్.. ఈసారి ఎన్నికలప్పుడూ అదే యాగాన్ని ఎర్రవల్లి ఫామ్ ‌హౌజ్‌లో నిర్వహించారు. నవంబర్‌ 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ యాగంలో పాల్గొంటూనే ప్రజా ఆశీర్వాద సభలకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత తన విశ్వాసానికి అనుగుణంగా మహాగని మొక్కను అడవి నుంచి తీసుకొచ్చి కొత్త సచివాలయం ప్రాంగణంలో నాటించారు. ప్రతీరోజు దాని సంరక్షణ కోసం అటవీ, ఉద్యానవన శాఖల అధికారులు చొరవ తీసుకున్నారు. ఏపుగా పెరిగేందుకు వీలుగా అవసరమైన ఆర్గానిక్ ఎరువులతో పాటు పురుగు పట్టకుండా మందుల్ని కూడా వాడారు. ఆ మొక్కకు ఔషధ విలువల సంగతి ఎలా ఉన్నా.. ఆధ్యాత్మికంగా శుభం జరుగుతుందని భావించిన కేసీఆర్.. దీన్ని సచివాలయంలో నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మొక్క ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేల స్వభావమో మరే కారణమో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బతకలేదు.

ప్రచారం ముగుస్తున్న సమయంలో అది బతికే అవకాశం లేదని తేలిపోయింది. ఇక బతికే ఛాన్స్ లేదని అర్థమైంది. ఏదో అపశకునమేననే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ ఎఫెక్టు రిజల్ట్ రోజున కనిపిస్తుందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయ్. మొక్క ఎండిపోవడం ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావనే అపశకునానికి సంకేతమని మరికొందరు అంటున్నారు. మొక్క ఎండిపోవడం అంటే.. కేసీఆర్ ఓటమికి సంకేతమే అంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.