KCR ON BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా బీజేపీని, కాంగ్రెస్‌ని తిట్టి పోసిన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు కమలం విషయంలో సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గాయం కారణంగా.. రెండు నెలల రెస్ట్ తర్వాత బయటకు వచ్చిన ఆయన.. కృష్ణా ప్రాజెక్టుల మీద ఒకసారి, రైతుల పరామర్శ మీద మరోసారి జనంలో పర్యటించారు. అయితే ఈ రెండు చోట్లా కూడా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలన, మంత్రులనే టార్గెట్ చేశారు.
AP CONGRESS: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. కడప నుంచి ఎంపీగా షర్మిల పోటీ
ఒకప్పుడు.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తాననీ, తనకు అవకాశం ఇస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీపై వయొలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు..? మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రంలో బీజేపీ, ఇండియా కూటమి మధ్య హోరా హోరీ ఫైట్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఓటర్లు కూడా దేశాన్ని దృష్టిలో పెట్టుకొనే ఓట్లేస్తారు. అప్పుడు కేసీఆర్ కూడా స్థానిక ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేయాలి. కానీ కమలం పార్టీ విషయంలో గులాబీ అధినేత పల్లెత్తు మాట కూడా అనడం లేదు. మొదట్లో బీఆర్ఎస్ నేతలను చేర్చుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి క్లియర్‌గా చెప్పారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని కామెంట్స్ మొదలయ్యాయో.. అప్పుడు గాంధీభవన్ గేట్లు తెరిచారు రేవంత్ రెడ్డి. BRSని టార్గెట్ చేయడంతో.. ఒక్కొక్కరుగా వచ్చి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దాంతో ఒకప్పుడు తాను ఎదిరించిన బీజేపీ, అధికారం చేపట్టిన కాంగ్రెస్.. రెండింటికీ శత్రువుగా మారారు కేసీఆర్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఎదురిస్తే కష్టాలు కోరి తెచ్చుకోవడమే అనుకున్నారు గులాబీ బాస్. పైగా లిక్కర్ కేసులో కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ట్యాపింగ్ కేసు ఎంత దూరం వెళుతుందో, BRSలో ఏ పెద్ద తలకాయలకు చుట్టుకుంటుందో తెలీదు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా విదేశాల నుంచి ఎక్విప్‌మెంట్ తెప్పించి చేసిన తప్పుడు పని ఫోన్ ట్యాపింగ్. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద చర్యలు సీరియస్‌గానే ఉంటాయని అంటున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ దోస్తీకి ప్రయత్నించారు గులాబీ బాస్. ఇదే విషయాన్ని పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా చెప్పారు. బీజేపీ ఫ్రెండ్షిప్ వద్దని గెంటేసినా ఆ పార్టీతో పెట్టుకుంటే.. మరిన్ని ఇబ్బందులు వస్తాయని గ్రహించారు గులాబీ బాస్. అందుకే కమలంపై సైలెంట్ అయ్యారు.