KCR TEMPLE: అమ్మకానికి కేసీఆర్‌ గుడి.. ఇదేందయ్యా ఇది..

ఓ టీఆర్ఎస్‌ కార్యకర్త.. కేసీఆర్‌కు ఏకంగా ఓ గుడి కట్టేశారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు అదే కేసీఆర్‌ మీద ఆ అభిమాని గుర్రుమంటున్నాడు. కేసీఆర్‌ కోసం కట్టిన గుడిని.. ఆ వ్యక్తి అమ్మకానికి పెట్టాడు. ఆర్థికంగా నష్టపోయినా.. పార్టీలో గుర్తింపు లేనందుకే అమ్మకానికి పెట్టానని అంటున్నాడు.

  • Written By:
  • Updated On - November 21, 2023 / 05:45 PM IST

KCR TEMPLE: కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అని పొగిడేస్తుంటారు బీఆర్ఎస్‌ నేతలంతా! ఉద్యమ పార్టీ నుంచి కారు పార్టీ రాజకీయ పార్టీగా మారిన తర్వాత సంగతి ఎలా ఉన్నా.. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పోరాటానికి ప్రతీ ఒక్కరు సలాం చేశారు. దేవుడు అంటూ ప్రశంసలు గుప్పించారు. అలా ఓ టీఆర్ఎస్‌ కార్యకర్త.. కేసీఆర్‌కు ఏకంగా ఓ గుడి కట్టేశారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు అదే కేసీఆర్‌ మీద ఆ అభిమాని గుర్రుమంటున్నాడు. కేసీఆర్‌ కోసం కట్టిన గుడిని.. ఆ వ్యక్తి అమ్మకానికి పెట్టాడు. ఆర్థికంగా నష్టపోయినా.. పార్టీలో గుర్తింపు లేనందుకే అమ్మకానికి పెట్టానని అంటున్నాడు.

KCR: కేసీఆర్‌ అమ్మమ్మ ఊరి చుట్టూ రాజకీయం.. కామారెడ్డిలో ఆ గ్రామం పరిస్థితేంటి..

మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్‌.. కేసీఆర్‌ మీద అభిమానంతో తన ఇంటి దగ్గర పాలరాతితో గుడి కట్టారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో తన ఇంటి వద్ద గుడి కట్టి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, అభిమానాన్ని చాటుకున్నాడు. ఐతే ఇప్పుడు కేసీఆర్‌ జనాలను పట్టించుకోవడం లేదని.. తనకు కష్టమొచ్చిందని ప్రగతి భవన్‌ వరకు వెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఫైర్‌ అవుతున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం రెండెకరాలు భూమిని అమ్ముకుని నష్టపోయాయని.. కేబుల్‌ పేరుతో తనను ఇబ్బందులు పెడుతున్నా.. ఆ గోడు వినడానికి దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రవీందర్‌.

దీంతో కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెడ్తూ అందుకు సంబంధించిన ఫ్లెక్సీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆసక్తి గల వారు కేసీఆర్ గుడి, విగ్రహాన్ని కొనుగోలు చేసి తనను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఫ్లెక్సీ కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.