KCR: ఓటమి తరువాత మొదటి సారి మీడియా ముందుకు కేసీఆర్‌.. ఎలా ఉన్నారంటే..

ఓటమిని జీర్ణించుకోలేకపోయారో.. లేక మీడియా ముందుకు రాలేకపోయారో తెలియదు కానీ.. పోలింగ్‌ ముగిసిన తరువాత కేసీఆర్‌ అసలు ఎవరికీ కనిపించలేదు. కెమెరా ముందుకు రాలేదు. బీఆర్ఎస్‌ ఓడిపోయింది అని తెలిసిన వెంటనే ఆయన తన ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు వెళ్లిపోయారు.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 07:48 PM IST

KCR: 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించాడు. దాదాపు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి చాలా విషయాల్లో తెలంగాణను నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంచాడు. ఆయన మాట్లాడితే మన ఇంట్లో మనిషి మాట్లాడినట్టే ఉంటుంది. ఆయన కనిపిస్తే చాలు.. బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ధైర్యం వస్తుంది. తెలంగాణలో కేసీఆర్‌ను కొట్టేవాడు లేడు.. ఇక రాడు అనుకుంటున్న తరుణంతో.. కాంగ్రెస్‌ ఆయనకు పెద్ద షాకిచ్చింది. దిమ్మ తిరిగే మెజార్టీతో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది.

CONGRESS: కాంగ్రెస్‌లో సస్పెన్స్‌.. సీఎం ప్రకటన ఇవాళ లేనట్టే..

ఓటమిని జీర్ణించుకోలేకపోయారో.. లేక మీడియా ముందుకు రాలేకపోయారో తెలియదు కానీ.. పోలింగ్‌ ముగిసిన తరువాత కేసీఆర్‌ అసలు ఎవరికీ కనిపించలేదు. కెమెరా ముందుకు రాలేదు. బీఆర్ఎస్‌ ఓడిపోయింది అని తెలిసిన వెంటనే ఆయన తన ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ వీడియో బయటకు వచ్చింది. బీఆర్‌ఎస్‌లో గెలిచిన నేతలతో తన ఫాంహౌజ్‌లో మీటింగ్‌ నిర్వహించారు కేసీఆర్‌. పార్టీ నేతలందరినీ పిలిచి భవిష్యత్‌ కార్యాచణపై మాట్లాడారు. పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను చర్చించారు. బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎంపిక ప్రక్రియ కూడా త్వరలోనే ఉంటుందని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలంటూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

ఈ వీడియో చూసిన ప్రతీ కేసీఆర్‌ ఫ్యాన్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాధపడుతున్నారు. కేసీఆర్‌ మొహంలో ఎప్పుడూ ఇంత బాధ, నిరుత్సాహం చూడలేదంటున్నారు. పార్టీ మీటింగ్‌ అంటే ఎంతో జోష్‌తో మాట్లాడి.. ఎమ్మెల్యేలలో ఎంతో జోష్‌ నింపే కేసీఆర్‌.. ఇలా డల్‌ అయిపోవడంతో తెగ ఫీలైపోతున్నారు బీఆర్ఎస్‌ కార్యకర్తలు, నాయకులు.