KCR-BJP: ఒప్పుకోండి ప్లీజ్ ! కేసీఆర్‌కి జైలు తప్పదా.. ఢిల్లీలో పైరవీలు అందుకేనా..?

ఒకప్పుడు తను పడ్డ బాధలను.. కేసీఆర్‌కి కూడా చూపించడానికి రేవంత్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌లో వణుకు మొదలైంది. తనను, తన కుటుంబాన్ని రక్షించేంది మోడీ ఒక్కరే అని డిసైడ్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 01:43 PM IST

KCR-BJP: తెలంగాణలో మొన్నటి ఎన్నికలతో ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అయ్యాయి. పదేళ్ళు చక్రం తిప్పిన కేసీఆర్.. ఇప్పుడు కనీసం అసెంబ్లీకి ముఖం కూడా చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాలుకి ఆపరేషన్ పేరుతో రెండు నెలలు ఇంట్లోనే గడిపేశారు. అదుగో బయటకొస్తున్నారు. ఇదిగో బయటకొస్తున్నారు. పులి జిల్లాలు చుట్టేస్తుంది.. అంటూ కేసీఆర్‌ని ఓ రేంజ్‌లో ప్రొజెక్ట్ చేశారు బీఆర్ఎస్ లీడర్లు. రేవంత్ కూడా అందుకు రెడీ అయ్యారు. పులిని బోనులో బంధిస్తామని కూడా చెప్పారు. కానీ కేసీఆర్.. ఒక్క నల్లగొండ సభలో పాల్గొని మళ్ళా ఇంటికెళ్ళిపోయారు. ఇప్పుడు సీఎం రేవంత్ తవ్వుతున్న గుంతలు ఎటు వైపు దారి తీస్తాయో.. ఎవర్ని ఊచలు లెక్కపెట్టిస్తాయో తెలియదు.

TSRTC: టీఎస్‌ఆర్టీసీ సరికొత్త ప్లాన్‌.. ఇక అందరికీ సీట్లు..

ఒకప్పుడు తను పడ్డ బాధలను.. కేసీఆర్‌కి కూడా చూపించడానికి రేవంత్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌లో వణుకు మొదలైంది. తనను, తన కుటుంబాన్ని రక్షించేంది మోడీ ఒక్కరే అని డిసైడ్ అయ్యారు. అందుకే కమలం పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు గులాబీ బాస్. తెలంగాణ ప్రజలు పదేళ్ళు అధికారంలో కూర్చోబెట్టారు. ఇంకేముంది.. ఇంకో 20యేళ్ళయినా నన్నే గెలిపిస్తారు.. మేం ఎన్ని స్కాములు చేసినా.. ఎవర్నీ ప్రగతి భవన్ ఛాయలకు రానీయకపోయినా.. జనం మాకే ఓట్లేస్తారు.. అని భ్రమల్లో బతికారు గులాబీ బాస్. అంతేనా.. భారత దేశాన్ని పాలించే తెలివితేటలు కూడా తనకే ఉన్నాయని ప్రగల్భాలు పలికారు. మరీ దారుణం ఏంటంటే.. దిక్కుమాలిన ప్రపంచ సూచీలను దగ్గర పెట్టుకొని పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే ఇండియా దిగజారిపోయిందని మీడియా ముందు లెక్చర్లు ఇచ్చారు. జర్నలిస్ట్ రాహుల్‌తో ఈ విషయాలు మరీ మరీ చెప్పారు. భారత్ దుస్థితికి నరేంద్ర మోడీయే కారణమంటూ ఎన్నోసార్లు తిట్టిపోశారు. అందుకే తెలంగాణ సెంటిమెంట్‌తో వచ్చిన TRSను తీసేసి BRS పార్టీ పెట్టి దేశం మొత్తం చుట్టేయాలని అనుకున్నారు.

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై క్లారిటీ..

నెక్ట్స్ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తానే అని కలలు గన్నారు. కానీ తెలంగాణలో అధికారం పోయాక.. తన రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకగానీ అసలు తత్వం బోధపడలేదు కేసీఆర్‌కు. రేవంత్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల్లో అవినీతినే ఎత్తుకున్నారు. మేడిగడ్డ దగ్గర అన్ని ప్రాజెక్టుల్లో, అన్ని స్కీమ్స్‌లో వేల కోట్ల రూపాయల అక్రమాలు బయటకు తీస్తున్నారు. ఈ దెబ్బతో వచ్చే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం ఏమో గానీ.. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ జైలుకు వెళ్ళడం ఖాయమంటున్నారు పరిశీలకులు. అందుకే అధికారం మత్తు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు గులాబీ పెద్దలు. ఇప్పుడు తమను ఆదుకునేది ఎవరని ఆలోచించారు కేసీఆర్. బీజేపీ సపోర్ట్ లేకపోతే రేవంత్ ఓ ఆటాడుకుంటారని అర్థమైంది. పైగా కేంద్రంలో మళ్ళీ వచ్చేది కూడా బీజేపీ ప్రభుత్వమే కావడంతో కమలంతోనే ఫ్రెండ్షిప్ కోసం వెంపర్లాడుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. బీజేపీ కోర్టులోనే బీఆర్ఎస్ బంతి ఉంది. ఢిల్లీ పెద్దలతో గులాబీ పార్టీ మధ్యవర్తులు రాయబారం చేస్తున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వెళ్దామంటూ కమలం వెంట పడుతున్నారు గులాబీ బాస్. 3 రోజులుగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో గులాబీ నేతల వేడుకోలు మంతనాలు సాగుతున్నాయి.

ఓవైపు లిక్కర్ స్కామ్‌లో కవితను కాపాడుకోవడం మరోవైపు తెలంగాణలో 10యేళ్ళ అవినీతి, స్కామ్స్ నుంచి బయటపడాలి. ఇంకా కేటీఆర్, ఇతర నేతలు జైలుకు వెళ్ళకుండా కాపాడుకోవడం కోసం గులాబీ బాస్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ రెడీ అయింది. ఎన్నికల్లో గెలిచాక NDAలో చేరి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని కూడా బీజేపీ హైకమాండ్‌కు కేసీఆర్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ఇప్పటి వరకూ ఎటూ తేల్చడం లేదు బీజేపీ అధిష్టానం. రేవంత్ నుంచి తప్పించుకోడానికి బీజేపీయే శరణ్యమనీ.. కాళ్ళు,చేతులు పట్టుకొని అయినా బీజేపీకి దగ్గరవ్వాలని బీఆర్ఎస్ లీడర్లు తెగ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి బీజేపీయే ఆయుధమనీ.. మరో మార్గం లేదనుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆయన సరెండర్ అవుతున్నారు. కానీ మోడీ, అమిత్ షా క్షమాభిక్ష పెడతారా.. దగ్గరకు చేర్చుకుంటారా అన్నది చూడాలి.