KCR warning  : బీఆర్ఎస్ లీడర్స్ కి కేసీఆర్ మాస్ వార్నింగ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్షాల సీట్లు మారాయి. ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చింది బీఆర్‌ఎస్‌. అయితే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్‌ వివాదాస్పదం అవుతున్నాయట. ప్రభుత్వం కనీసం కుదురుకోక ముందే.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌ కలకలం రేపుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్షాల సీట్లు మారాయి. ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చింది బీఆర్‌ఎస్‌. అయితే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్‌ వివాదాస్పదం అవుతున్నాయట. ప్రభుత్వం కనీసం కుదురుకోక ముందే.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌ కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ పూర్తి కాలం కొనసాగడం కష్టమని, త్వరలోనే కూలిపోతుందని వారు అన్న మాటలు కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని తాను అనలేదంటూ వివరణ ఇచ్చారు పల్లా. నేను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారాయన. ఇక కడియం శ్రీ హరి అయితే.. తాను మాట్లాడిన విషయాన్ని తప్పుగా ప్రెజెంట్ చేశారంటూ నాలుక మడతేశారు.

కాంగ్రెస్‌కు బొటాబొటి మెజార్టీ ఉందని, ఆ పార్టీలో గ్రూప్స్ కామన్‌ అని తాను అన్నట్టు కవరింగ్‌ ఇచ్చుకుంటున్నారు కడియం. కానీ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అన్న మాటలు జనంలోకి వెళ్ళి జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. శుభం పలకమంటే అదేదో అన్నట్టు.. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టీ పట్టగానే కారు పార్టీ నేతలు కూలిపోవడం గురించి మాట్లాడుతున్నారంటే.. వాళ్ళ ఫ్రస్టేషన్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోందన్న వాదన బలపడింది. దీంతో ఈ వ్యవహారం ఎట్నుంచి ఎటో పోతోందని గ్రహించిన గులాబీ పార్టీ పెద్దలు డ్యామేజ్‌ కంట్రోల్‌ మొదలుపెట్టారట. నాయకులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడవద్దని హై కమాండ్‌ ఆదేశించినట్టు తెలిసింది. తొందరపాటులో నోటికి వచ్చిన మాటలు మాట్లాడవద్దని స్పష్టమైన సంకేతాలు పంపినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు.

ఇక ముందు పార్టీ లైన్ ప్రకారం ఎమ్మెల్యేలు ముందుకు సాగాలని గులాబీ పెద్దలు స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తొందర పడి కామెంట్స్ చేస్తే పార్టీకి నష్టం జరుగుతోందంటూ ఒకింత సీరియస్‌ అయినట్టు తెలిసింది. దీంతో ఇక ముందు బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు అంతా జాగ్రత్తగా మాట్లాడతారని గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు ఆ పార్టీ మరో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా తొందరపాటు తగదని…కొత్త సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇకపై గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆచితూచి మాట్లాడతారని, ఒక విధంగా అది మంచిదేనని అంటున్నాయి రాజకీయ

 

వర్గాలు.