KCR-REVANTH: ఈ నేతలు రెండు చోట్లా గెలుస్తారా..? ఓడుతారా..?

2014, 2018 ఎన్నికల్లో కేవలం గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి మాత్రం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కామారెడ్డిలో కేసీఆర్‌ విజయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 07:52 PM IST

KCR-REVANTH: తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఇక్కడి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అదే మూడు పార్టీల నుంచి ముగ్గురు పెద్దలు.. రెండు స్థానాల నుంచి పోటీ చేయడం. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేస్తే.. హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో పోటీ చేశారు ఈటల. ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్.. కొడంగల్‌లో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఎవరెవరు రెండు చోట్ల గెలుస్తారు.. ఎవరు ఒక్కచోట విజయంతోనే సరిపెట్టుకుంటారు అనే చర్చ జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో కేవలం గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.

KCR: కామారెడ్డిలో కేసీఆర్‌కు ఓటమి తప్పదా.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే..!

ఈసారి మాత్రం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కామారెడ్డిలో కేసీఆర్‌ విజయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. కామారెడ్డిలోనూ గెలిచి తీరుతారని బీఆర్ఎస్‌ శ్రేణులు అంటుంటే.. అక్కడ గెలిచేది బీజేపీ అంటూ ఆరాలాంటి సర్వే సంస్థలు చెప్తున్నాయ్. ఇక అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. తనకు పట్టున్న హుజూరాబాద్‌తో పాటు కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్ నుంచి కూడా బరిలో ఉన్నారు. ఐతే గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఈటల ఎంతవరకు పోటీనిస్తారనేది ఆసక్తికరం. గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఈటల పైచేయి సాధించడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది. అటు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌తో పాటు కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు.

కొడంగల్‌లోనే రేవంత్‌ను కొట్టాలని బీఆర్ఎస్‌ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌కు మంచి కేడరే ఉన్నా.. దాన్ని హస్తం పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరం. మొత్తానికి రెండు చోట్ల పోటీ చేస్తున్న నేతల విషయంలో డబుల్ విన్నింగ్ సాధించడం ముగ్గురు నేతలకు కష్టమా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మరి ఈ అంచనాలు నిజం అవుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.