Kavitha – KCR: కవిత వ్యవహారంలో కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి ?

కవితను అరెస్ట్ చేస్తే... ఏం చేయాలనేదానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయ్. కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడో జరిగే పరిణామానికి ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టే కేసీఆర్‌.. కవిత వ్యవహారంలో స్ట్రాంగ్ వ్యూహమే రెడీ చేసి ఉంటారన్నది మరికొందిరి అభిప్రాయం.

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 07:19 PM IST

తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట ఒక్కటే.. అదే లిక్కర్ స్కామ్ వ్యవహారం ! ఢిల్లీలో మొదలైన రచ్చ తెలుగు రాష్ట్రాలకు పాకడానికి.. వివాదం కావడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. కవితను విచారించేందుకు ఈడీ సిద్ధం అవుతోంది. దీక్ష ఉంది తర్వాత వస్తా అని కవిత లేఖ రాసినా సానుకూలంగా రియాక్ట్ కాలేదు ఈడీ ! దీంతో కవిత అరెస్ట్ ఖాయం అంటూ ప్రచారం ఊపందుకుంది. లిక్కర్‌ ఎపిసోడ్‌లో బీఆర్ెస్, బీజేపీ మధ్య జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. 11న ఈడీ ముందు కవిత హాజరు కాబోతోంది. ఆరోజే కవితను అరెస్ట్ చేయవచ్చనే గుసగుసలు ఢిల్లీ గల్లీల్లో వినివిస్తున్నాయ్. ఆరోజు కవితను అరెస్ట్ చేస్తే… ఏం చేయాలనేదానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయ్. కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడో జరిగే పరిణామానికి ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టే కేసీఆర్‌.. కవిత వ్యవహారంలో స్ట్రాంగ్ వ్యూహమే రెడీ చేసి ఉంటారన్నది మరికొందిరి అభిప్రాయం.

11న కవిత ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇప్పటికే వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీయేనని అంగీకరించినట్లు ఈడీ ఛార్జ్ షీటులో తెలిపింది. పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం మేరకే… ఇప్పుడు కవితను ఈడీ విచారించబోతోంది. కవితను విడిగా ప్రశ్నిస్తారని.. పిళ్లైతో కలిసి కూర్చొబెట్టి ప్రశ్నిస్తారని.. రకరకాల ప్రచారం ఊపందుకుంది. 13తో పిళ్లై కస్టడీ ముగుస్తుంది. వీళ్లిద్దరినీ కలిపి విచారించేందుకే కవితకు హడావుడిగా నోటీసులు ఇచ్చినట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. కవిత అరెస్ట్ జరిగితే.. బీఆర్ఎఎస్‌కు అది దెబ్బగా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీపై దండయాత్ర మొదలుపెట్టిన కేసీఆర్‌ జోరుకు బ్రేకులు వేసేందుకు బీజేపీకి ఆయుధం లభించినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. గ్యాస్ బండ ధరల లొల్లి నుంచి.. అదానీకి మోదీ అండ అనే నినాదాల వరకు.. కమలాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న బీఆర్ఎస్‌కు.. కవిత అరెస్ట్ అయితే దెబ్బ తప్పదు అని కొందరు భావిస్తున్నారు.

ఐతే కవితను అరెస్ట్ చేస్తే.. బీజేపీ కక్షసాధింపు ధోరణికి పాల్పడుతోందని.. తన కుటుంబమే దానికి ఎగ్జాంపుల్ అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా కేసీఆర్ తీసుకెళ్లే అవకాశం ఉందని.. దీంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీపై యుద్ధంపై మరింత పట్టు దొరుకుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్. ఢిల్లీ లెవల్‌ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ గల్లీల్లో మాత్రం అరెస్ట్ వ్యవహారం కారు పార్టీకి కలిసొచ్చే చాన్స్ ఉందని ఇంకొందరి వాదన. తెలంగాణ ఆడబిడ్డ అరెస్ట్ అనే ప్రచారంతో.. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ మీద సింపథీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.