కేజ్రివాల్ మరోసారి అరెస్ట్…?

ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దూకుడు పెంచింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.

  • Written By:
  • Updated On - December 21, 2024 / 12:53 PM IST

ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దూకుడు పెంచింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. డిసెంబర్ 5న అరవింద్ కేజ్రీవాల్‌ ను ప్రాసిక్యూషన్‌కు ఈడీ అనుమతి కోరింది. కేజ్రీవాల్ ను ఈడీ ప్రాసిక్యూషన్ చేసే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలపై ఫోకస్ చేసారు.

ఇదే కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా విచారించే అవకాశం కనపడుతోంది. కవితకు కూడా ఈ కేసులో బెయిల్ వచ్చింది. నిందితులు అందరూ ప్రస్తుతం బయటే ఉన్నారు. ఇప్పుడు కేజ్రివాల్ ను మరోసారి అరెస్ట్ చేసే సంకేతాలు కనపడుతున్నాయి.