KESINENI NANI VS PVP: నాని వర్సెస్ పీవీపీ.. బోరుకొచ్చిన బండి.. షెడ్డు మారిందంతే

ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీలో నాని చేరికపై 'బండి బోరుకొచ్చింది. షెడ్డు మారింది అంతే' అంటూ సెటైర్లు వేశారు PVP. ఇప్పుడు ఇంకో ట్వీట్ Xలో పెట్టడంతో.. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య పోరు తప్పేలా లేదంటున్నారు వైసీపీ నేతలు.

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 04:20 PM IST

KESINENI NANI VS PVP: చంద్రబాబు వద్దనడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చిన బెజవాడ ఎంపీ కేశినేని (KESINENI NANI) నాని వైసీపీలో చేరారు. ఇక్కడ ఎంపీ టిక్కెట్ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. కానీ, 2019లో ఆయన మీద పోటీ చేసి ఓడిన పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) మాత్రం నానిని అంత తేలిగ్గా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీలో నాని చేరికపై ‘బండి బోరుకొచ్చింది. షెడ్డు మారింది అంతే’ అంటూ సెటైర్లు వేశారు PVP. ఇప్పుడు ఇంకో ట్వీట్ Xలో పెట్టడంతో.. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య పోరు తప్పేలా లేదంటున్నారు వైసీపీ నేతలు.

MUDRAGADA PADMANABHAM: ముద్రగడ యూటర్న్ వెనక.. ఏం జరిగిందో తెలుసా..?
బెజవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరారు. ఇక్కడ కూడా ఆయనకే బెజవాడ ఎంపీ టిక్కెట్ ఇస్తారని భరోసా కూడా వచ్చిందట. 2019లో ఆయన మీద పోటీ చేసి 8 వేల 700 ఓట్లతో ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ మాత్రం నానిపై విరుచుకుపడుతున్నారు. నాని వైసీపీలోకి రావడం ఇష్టంలేని పొట్లూరి.. ఆయన పేరును డైరెక్ట్‌గా ప్రస్తావించకుండా చేసిన పోస్టు సంచలనంగా మారింది. బోరుకొచ్చిన బండి.. షెడ్డు మారిందంతే.. వీడి గుడిసేటి బుద్ది గురించి బెజవాడంతా తెలుసు కదరా అబ్బాయ్ అంటూ పోస్ట్ పెట్టారు పీవీపీ. అంతటితో ఆగకుండా ఇవాళ మరో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అందులో పిప్పాల బస్తా.. బెజవాడకు గుదిబండలా తయారయ్యావ్.. ఏదో మచ్చ వేసుకొని పుట్టావ్.. పార్టీ పుణ్యమా అని పదేళ్ళు బండి కొనసాగించావ్.. బ్యాంకులను బాదావ్.. జనాలను, ఉద్యోగులను పీల్చి పిప్పి చేశావ్.. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి.. అన్నీ మూసుకొని మూలన పడుండు.. అంటూ నానిని కామెంట్ చేశారు పీవీపీ.

ఈ కామెంట్స్‌తో బెజవాడ వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. కేశినేని వైసీపీలోకి రావడం పీవీపీకి అస్సలు ఇష్టం లేనట్టు అర్థమవుతోంది. పైగా ఈసారి ఎంపీ టిక్కెట్ కూడా నానికి ఇస్తారని టాక్ వస్తుండటం వల్లే పీవీపీ ఆయనపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. కానీ, రాజకీయాలకు దూరంగా ఉన్న పొట్లూరి ఇలాంటి ట్వీట్ల పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మరికొందరు. గతంలో కేశినేని ట్రావెల్స్‌లో జీతాలు ఇవ్వట్లేదని సిబ్బంది విజయవాడలో ఆందోళన చేశారు. అప్పుడు కూడా కసాయి వాడికి గొర్రె మీద ఉన్న ప్రేమ కూడా.. నీ దగ్గర పనిచేసే కార్మికుల మీద లేదా అని ప్రశ్నంచారు పీవీపీ. ఇప్పుడు పీవీపీ చేస్తున్న ట్వీట్లు టీడీపీకి వరంగా మారాయి. నానిపై పెట్టిన ఈ ట్వీట్స్‌ని ఆ పార్టీ లీడర్లు వైరల్ చేస్తున్నారు.