ఎపి స్టేట్ అక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ సెజ్ లో రూ. 2 వేల కోట్ల కేవీరావు భూములను రూ. 12 కోట్లకే జే గ్యాంగ్ కొట్టేసిందని ఆరోపించారు. దిన్నీ గన్ను పెట్టి బెదిరించడం కాకుంటే ఏమంటారు? అని నిలదీశారు. ఆ డబ్బులకు కూడా ఆరు నెలలకు చెక్ ఇచ్చారని… దీని వెనుక జగన్ రెడ్డి హస్తం లేదా? విక్రాంత్ రెడ్డి, శరత్ రెడ్డి , విజయసాయిరెడ్డిల వెనుక ఉంది ఎవరు జగన్ రెడ్డి నువ్వు కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రపంచంలో ఎవరైనా రూ. 2 వేల కోట్ల ఆస్తిని 12 కోట్లకు అమ్ముకుంటారా? బెదిరించి లాక్కోవడం కాకుంటే అని ఆయన ప్రశ్నించారు.
కాకినాడ షీ పోర్టులో కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి 41% శాతం వాటాను కొట్టేశారన్నారు. వైసీపీ దోపిడీ ముఠా రూ. 494 కోట్లకే 41% వాటాను కొట్టేయడం వాస్తవం కాదా? అని రాష్నించారు. రూ. 2,689 కోట్ల షేర్ విలువను రూ. 494 కోట్లకు ఎవరైనా అమ్ముతారా? అని నిలదీశారు. వైసీపీ గ్యాంగ్ కు షేర్లు ట్రాన్ఫర్ అయిన వెంటనే రూ.1000 కోట్లు కట్టాల్సిన ఫైన్ కాస్త 8 కోట్లకు ఎలా తగ్గింది?. జగన్ రెడ్డిని ఏ1 గా చేర్చి వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేసారు.