Vedma Bhojju: మీరు సూపర్ సార్‌.. ప్రభుత్వాసుపత్రిలో అధికార పార్టీ ఎమ్మెల్యే

ఖానాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.. చిన్న అస్వస్థతకు గురయ్యారు. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. జ్వరం అధికంగా ఉండటంతో నాలుగైదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 01:53 PM IST

Vedma Bhojju: ఎమ్మెల్యేకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న జ్వరం వచ్చినా చాలు.. ఆ ఏరియాలోనే ది బెస్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుంటారు. జనాలు వస్తుంటారు.. లీడర్లు హడావుడి చేస్తుంటారు.. ఈగ వాలకుండా చూసుకుంటారు. కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం చాలా డిఫరెంట్‌. రాత్రి జ్వరం వచ్చింది.. తెల్లవారుజామున సామాన్యుడిలాగా ఒక్కడే వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయ్యారు.

Congress : ప్రతీచోట రేవంత్‌ పక్కనే భట్టి.. ఇంత ప్రాధాన్యం ఇందుకేనా..

ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఖానాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.. చిన్న అస్వస్థతకు గురయ్యారు. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. జ్వరం అధికంగా ఉండటంతో నాలుగైదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై జనాల్లో నమ్మకం పోతున్న తరుణంలో.. సర్కార్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే చికిత్స పొందడం ఆదర్శనీయం అంటూ స్థానికుల్లో చర్చ జరుగుతోంది. గొప్పలకు పోకుండా ప్రజాప్రతినిధులంతా ఇలా చేస్తే.. అందరికీ మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. వెడ్మ బొజ్జు ఆసుపత్రిలో చేరిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు సూపర్ సార్ అంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెడ్మ బొజ్జుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంది.

ఖానాపూర్‌లాంటి ఏరియాలో మంచి మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయన జీవనశైలిలో మార్పు కనిపించడం లేదు. దీనికి సలాం అంటున్నారు నెటిజన్లు. చిన్నతనంలో పేపర్ బాయ్ పనిచేసిన వెడ్మ బొజ్జు.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కేటీఆర్ మిత్రుడైన జాన్సన్ నాయక్‌ భూక్యాపై బొజ్జు ఘన విజయం సాధించారు.