తిడుతున్న ఎల్లో మీడియా, బయటకు వచ్చిన మంత్రి

ఎప్పుడు మీడియా ముందు నీతి వాక్యాలు చెప్పే మాజీ మంత్రి పెర్ని నాని అడ్రస్ లేడని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. గత 15, 20 రోజులుగా కనిపించకుండా పోయాడన్నారు.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 01:28 PM IST

ఎప్పుడు మీడియా ముందు నీతి వాక్యాలు చెప్పే మాజీ మంత్రి పెర్ని నాని అడ్రస్ లేడని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. గత 15, 20 రోజులుగా కనిపించకుండా పోయాడన్నారు. తన భార్య, తల్లి పేరు మీద ఉన్న రేషన్ గోడౌన్ లో పేదల బియ్యం 5000 బస్తాలు బియ్యం అక్రమంగా తరలించారని ఎవరు అడిగినా సమాధానం చెప్పకుండా ఊరు వదిలి పారిపోయారని ఎద్దేవా చేసారు.

దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తానంటే దొరైపోతాడా అని నిలదీశారు. ఐదు సంవత్సరాలు దోచుకుని ఇప్పుడు తప్పించకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. గోడౌన్ లో పని చేస్తున్న మేనేజర్, సిబ్బందిని కూడా మాయం చేశారని నాని ఎక్కడున్నా పట్టుకుని తీరుతామన్నారు. కాగా ఈ మధ్య ఈ వ్యవహారంపై మంత్రి స్పందించడం లేదనే ఆరోపణల నేపధ్యంలో తాజాగా కొల్లు రియాక్ట్ అయ్యారు.