Komatireddy Raj Gopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ హ్యాండ్ ఇస్తారా..?

బీజేపీ కార్యక్రమాల్లోనూ రాజగోపాల్ రెడ్డి పెద్దగా కనిపించింది లేదు. దీంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. నియోజకవర్గంలోనూ ఎలాంటి కార్యక్రమానికి ఆయన హాజరుకావడం లేదని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 06:27 PM IST

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో ఎన్నికల కాలం నడుస్తోంది. దీంతో ప్రతీ పరిణామం కలకలం రేపుతోంది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌ జపాంగ్‌లు పీక్స్‌కు చేరాయ్. కర్ణాటక ఫలితంతో కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. బీఆర్ఎస్‌లో అసంతృప్తులు.. మిగతా పార్టీల్లో ఇబ్బంది పడుతున్న నేతలంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారు.

దీంతో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ ఇలాంటి చర్చే రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలంగాణ రాజకీయాల్లో తెలియని జనాలు ఉండరు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో వీళ్లు సంచలనం సృష్టించే రాజకీయవేత్తలు. అలాంటి అన్నదమ్ముల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంటే.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. కొన్ని నెలల కింద కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు బై పోల్‌లో బీజేపీ తరఫున బరిలో దిగి ఓడిపోయారు. ఐతే, ఆ తర్వాత నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించింది లేదు.

దీంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. నియోజకవర్గంలోనూ ఎలాంటి కార్యక్రమానికి ఆయన హాజరుకావడం లేదని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి అంత ఆదరణ లేదని ఫిక్స్ అయ్యారని.. అందుకే కమలానికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటోంది. అదే సమయంలో బీజేపీ మరింత వీక్ అవుతోంది. దీంతో కమలం పార్టీలో చేరి తప్పు చేశాననే ఫీలింగ్‌లోకి రాజగోపాల్ వెళ్లారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలిటికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.

ఐతే ఇది ప్రచారం మాత్రమే. దీనిపై రాజగోపాల్‌ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ రావడం లేదు. అవును అనడం లేదు.. అలా అని కాదు అని కూడా అనడం లేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి నుంచి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వస్తుందోననే ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది.