KONDA SUREKHA: డాషింగ్ లేడీ.. కొండా సురేఖ.. పట్టుబట్టి విజయం..

బీసీ- పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ.. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 15,652 ఓట్ల ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్నారు. గతంలో శాయంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన కొండా సురేఖకు ఇది నాలుగో విజయం.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 06:51 PM IST

KONDA SUREKHA: కొండా సురేఖ.. తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లని పేరు. ఓరుగ‌ల్లు రాజ‌కీయాలను శాసించ‌డ‌మే కాదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర వ‌హించిన కొండా దంపతులకు రాజ‌కీయంగా విప‌రీత‌మైన ప‌ట్టు, క్రేజ్ ఉంది. టీడీపీతో మొద‌లైన వీరి ప్ర‌స్థానం అటు త‌ర్వాత కాంగ్రెస్‌కు, వైఎస్సార్సీపీకి, అటు త‌ర్వాత టీఆర్ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి మారింది. తెలంగాణ‌లో ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు.. కాంగ్రెస్‌లోకి మారిన వీరు ఈసారి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు.

REVANTH REDDY: మంత్రి పదవులెన్ని..? పోటీ పడుతోంది ఎందరు..?

బీసీ- పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ.. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 15,652 ఓట్ల ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్నారు. గతంలో శాయంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన కొండా సురేఖకు ఇది నాలుగో విజయం. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావును ఓడించి విజ‌యం సాధించారు. కొండా సురేఖ రాజ‌కీయ ప్ర‌స్థానం ఎంతో సుదీర్ఘ‌మైనది. ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు అనేక పదవుల్లో కొనసాగారు. 1995లో మండల పరిషత్ కు ఎన్నికైన సురేఖ‌.. 1996లో ఏపీ పీసీసీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1999లో శాయంపేట శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1999లో ఆమె కాంగ్రెస్ లెసిస్లేచర్ పార్టీ కోశాధికారిగానూ, మహిళ, శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగానూ, ఆరోగ్య, ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.

Pushpa 2: పుష్ప కేశవ అరెస్ట్‌.. ఇదేంది మచ్చా.. ఇట్టా చేసినవ్‌..

2000లో ఏఐసీసీ సభ్యురాలయ్యారు. 2004లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. 2005లో ఆమె మ్యునిసిపల్ కార్పొరేషన్ కు ఎక్స్‌ అఫీసియో సభ్యురాలిగా ఉన్నారు. 2009లో పరకాల శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2009లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కేబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. వైఎస్సార్ మరణం, ఆపై ఆయన కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వనందున కాంగ్రెస్‌కు రాజీనామా చేసారు. జూలై 4, 2011న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అనంతరం వైసీపీలో చేరి ఉప ఎన్నికలలో పరకాల నుంచి పోటీ చేశారు. వైసీపీకి రాజీనామా చేసి 2013లో టీఆర్ఎస్‌లో చేరిన కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మళ్ళీ కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఇక‌.. కొండా సురేఖ‌కు డేరింగ్ అండ్ డేషింగ్ లేడీగా పేరుంది. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వెయ్యండి అంటూ ఆమె ఓట్లు అడిగారు.

ఈ విషయం వరంగల్ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ కనుక అధికార పార్టీ ఆఫీసుకు వెళ్లి మరీ ఓట్లు అడిగినా.. నవ్వుతూనే బటయకు వచ్చారని స్థానికులు అనుకున్నారు. భ‌ర్త‌ కొండా మురళి సహకారంతో రాజకీయాల్లో రాణించి ఆమె కూడా ఈసారి వరంగల్‌ తూర్పు నుంచి గెలిచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. బీసీ మహిళగా, మాజీ మంత్రిగా కొండా సురేఖకు అవకాశం ద‌క్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.