Kondanda Ram: పార్టీ విలీనానికి సిద్ధం అంటున్న కోదండరాం కాంగ్రెస్‌లోనా, ఆప్‌తోనా.. కలిసేది ఎవరితో?

తెలంగాణ జనసమితి.. పేరులోనే జనం, పార్టీలో కాదు ! తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయిందీ పార్టీ! 2018 ఎన్నికల్లో కోదండరాం సహా అందరూ ఓడిపోగా.. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకు పరాభవమే ఎదురైంది. స్థానిక ఎన్నిక సంగతి సరేసరి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. జేఏసీని నడిపించిన కోదండరాం.. కారణం ఏదైనా పార్టీని సక్సెస్‌ఫుల్‌గా నడిపించలేకపోయారు.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 03:50 PM IST

తెలంగాణ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. మరో ఆరు నెలల్లో ఎలక్షన్స్‌ జరగబోతున్నాయ్. ప్రతీ రోజు కొత్త మలుపు కనిపిస్తోంది ఇక్కడి రాజకీయాల్లో. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్.. అధికారంలో కాంగ్రెస్‌, బీజేపీ తగ్గేదే లే అంటున్నాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య పొత్తులు, విలీనాల వ్యవహారాలు తెరమీదకు వస్తున్నాయ్. వైటీపీ, తెలంగాణ జనసమితి విషయంలో ఈ చర్చ పదేపదే వినిపిస్తోంది. షర్మి, కాంగ్రెస్‌ చేతులు కలుకుతారని జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. తన పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేయబోతుందనే గుసగుసలు కూడా వినిపించాయ్.

ఆ తర్వాత షర్మిల క్లారిటీ ఇచ్చినా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. వైటీపీ విషయంలో ఇంత రచ్చ జరుగుతుండగానే.. ఇప్పుడు కోదండరాం వ్యవహారం మరింత హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ జనసమితి పార్టీ విలీన అంశంపై తెరపైకి వచ్చింది. ఈసారి స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామే.. విలీనం గురించి కామెంట్స్ చేశారు. జనాల ఆకాంక్షలకు అనుగుణంగా… వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తుకు తాను సిద్ధమని కోదండరాం ప్రకటించారు. అవసరమైతే తన పార్టీ విలీనానికైనా సిద్ధమేనని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ జనాల ఆకాంక్షలు నేరవేర్చేందుకు ఏ నిర్ణయానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

పార్టీ విలీనంపై కోదండరాం చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. తెలంగాణ రాజకీయాపై ఫోకస్ పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ.. కోదండరాంతో కలిసి నడిచేందుకు సిద్ధమైందని.. రెండు పార్టీలు కలిసిపోతాయని ఆ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే అది ప్రచారంగానే మిగిలింది. ఐతే కేసీఆర్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించి తీరాలని కోదండరాం కసి మీద కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన కాంగ్రెస్‌తోనే కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. లేదంటే పార్టీని పూర్తిగా విలీన చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జరగబోయేది ఇదేనని.. కోదండరాం కామెంట్స్ టీజర్‌లాంటివి అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మహాకూటమిలోనే ఉంది టీజేఎస్. ఒకసారి కలిసిన అనుభవం ఉన్న పార్టీలో కలిపేస్తే సమస్యేముందనే చర్చ జరుగుతోంది. ఈ మాత్రం విలీనం చేయడానికి.. ఎదిరించడాలు.. పార్టీ అంటూ ఎదురువెళ్లడాలు ఎందుకు కోదండరాం సార్ అని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.