KOVA LAKSHMI: సంక‌ల్ప‌మే బ‌లం.. మరోసారి దక్కిన విజయం..

అసిఫాబాద్ (ఎస్టీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోవా లక్ష్మి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆజ్మీరా శ్యామ్‌పై 22,799 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అంతకుముందు 2014లో గెలిచినా.. 2018లో ఓడిపోయారు. ఆమె కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గానూ పనిచేశారు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 05:58 PM IST

KOVA LAKSHMI: ఇటీవల తెలంగాణలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో హ‌స్తం సునామీని త‌ట్టుకొని నిల‌బ‌డి.. విజ‌యం సాధించిన బీఆర్ఎస్ లీడ‌ర్ల‌లో కోవా ల‌క్ష్మి కూడా ఒక‌రు. వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నా.. ఆ గాలి నుంచి త‌ప్పించుకొని తొలిసారి విజ‌యం సాధించారు కోవా ల‌క్ష్మి. అసిఫాబాద్ (ఎస్టీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోవా లక్ష్మి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆజ్మీరా శ్యామ్‌పై 22,799 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అంతకుముందు 2014లో గెలిచినా.. 2018లో ఓడిపోయారు.

REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..

ఆమె కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గానూ పనిచేశారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కించుకున్న కోవా లక్ష్మి 2014లో తొలిసారి ఆ పార్టీ తరఫున ఆసిఫాబాద్‌‌లో గెలుపొందారు. కోవా లక్ష్మి.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొంది ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. కోవా లక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్‌ చైర్మన్‌‌గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్ నడిచిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ మాత్రం ఆమె మీద న‌మ్మ‌కం ఉంచారు. ఆ నమ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న కోవా ల‌క్ష్మి మ‌రోసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

కాంగ్రెస్ ధాటికి బీఆర్ఎస్‌కు చెందిన బ‌డా బ‌డా నేతలే.. బేజారెత్తిపోయిన వేళ‌.. ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను త‌న‌కు మ‌ద్ద‌తుగా మ‌ల‌చుకోవ‌డానికి కోవా ల‌క్ష్మి చివ‌రి వ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయనే చెప్పాలి. మరోసాకి కోవా లక్ష్మి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.