KTR: సీఎం కన్నా కేసీఆరే అనే 3 అక్షరాలే పవర్‌ఫుల్‌ :కేటీఆర్

కాంగ్రెస్ సర్కార్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కంటే.. ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్.

  • Written By:
  • Updated On - January 10, 2024 / 08:16 AM IST

KTR: తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన మార్క్ పాలన జనాలకు చూపిస్తున్నారు. గత సర్కార్ హయాంలో జరిగిన పరిణామాలను ఎత్తిచూపుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు.. బీఆర్ఎస్‌పై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. 22 ల్యాండ్ క్రూసర్ల నుంచి.. లేటెస్ట్‌గా ఫార్ములా ఈ-రేస్ వరకు వచ్చి ఆగింది పంచాయితీ. అటు బీఆర్ఎస్‌ నుంచి అదే లెవల్‌లో కౌంటర్‌లు వస్తున్నాయ్. దీంతో రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.

REVANTH REDDY: ఇదీ రేవంత్‌ అంటే.. కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం.. ఇది కదా ప్రజా పాలన అంటే..

ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కంటే.. ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. అధికార కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. “రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి. కేసీఆర్ అధికారంలో ఉండటం కంటే ప్రతిపక్షంలో ఉండటమే ప్రమాదం. ఫిబ్రవరిలో కేసీఆర్ జనాల మధ్యకు వస్తారు. సీఎం అనే రెండక్షరాల కంటే.. కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్‌ఫుల్” అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయ్. జనాల నమ్మకాన్ని తక్కువ కాలంలో కోల్పోయే గుణం కాంగ్రెస్ పార్టీ సొంతమని.. గత చరిత్రను పరిశీలిస్తే అదే అర్థం అవుతుందని కేటీఆర్‌ అన్నారు.

1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన జనాలు కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్.. ఆ తర్వాత జరిగిన నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిందని.. ఆ ఎన్నికల్లో అదే జనాలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారని.. ఈ వాస్తవం, చరిత్ర మనం మర్చిపోకూడదని అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. సీఎం కంటే కేసీఆర్‌ పవర్‌ఫుల్ అనడం.. ఏడాదిన్నర విషయాన్ని కేటీఆర్ గుర్తు చేయడంతో.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.