KTR Daughter: కేటీఆర్‌ కూతురా.. మజాకా.. స్కూల్‌ ప్రాజెక్ట్‌ అదరగొట్టిన అలేఖ్య రావు..

ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓక్‌రిడ్జ్‌ స్కూల్‌లో కేటీఆర్‌ కూతురు అలేఖ్య చదువుతోంది. రీసెంట్‌గా ఆ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన ప్రాజెక్ట్‌లో అదిరిపోయే కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకుంది అలేఖ్య. చిన్న వ్యాపారులకు కూడా ఉపయోగపడేలా ఓ ప్లాట్‌ఫాం క్రియేట్‌ చేసి.. అందరిచేత శభాష్‌ అనిపించుకుంది.

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 08:45 PM IST

KTR Daughter: రాజకీయాల సంగతి పక్కన పెడితే.. బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్‌ తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారు. స్టేజ్‌ మీద కేటీఆర్‌ స్పీచ్‌ ఇస్తుంటే ఆయన పొలిటీషియన్‌లా కనిపించరు. ఎవరైనా కొత్తవాళ్లు చూస్తే ఆయనెవరో ఐటీ ప్రొఫెషనల్‌ కావొచ్చు అనే అనుకుంటారు. కేటీఆర్‌ యాటిట్యూడ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆ రేంజ్‌లో ఉంటాయి. చెట్టొకటి ఐతే పండు మరొకటి అవుతుందా అన్నట్టు.. తండ్రి ఇలా ఉండే పిల్లలు మరోలా ఉంటారా..? అందుకే కేటీఆర్‌ కూతురు కూడా స్కూల్‌లో అదరగొడుతోంది.

KCR: కేసీఆర్‌ లేకుండానే మీటింగ్‌.. ఖాళీ కుర్చీని చూసి కేటీఆర్‌ ఎమోషనల్‌..

ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓక్‌రిడ్జ్‌ స్కూల్‌లో కేటీఆర్‌ కూతురు అలేఖ్య చదువుతోంది. రీసెంట్‌గా ఆ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన ప్రాజెక్ట్‌లో అదిరిపోయే కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకుంది అలేఖ్య. చిన్న వ్యాపారులకు కూడా ఉపయోగపడేలా ఓ ప్లాట్‌ఫాం క్రియేట్‌ చేసి.. అందరిచేత శభాష్‌ అనిపించుకుంది. ఆ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న మిగిలిన విద్యార్థులు కూడా అలేఖ్య చేసిన ప్రాజెక్ట్‌కు ఫిదా అయ్యారు. అంతా ఆమె దగ్గరకు వెళ్లి తన ప్రాజెక్ట్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో అంతా అలేఖ్యను మెచ్చుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో కూడా అలేఖ్యకు ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. తండ్రికి తగ్గ కూతురు అంటూ అందరూ అలేఖ్యను ఆకాశానికెత్తేస్తున్నారు. కేటీఆర్‌ కొడుకు హిమాన్షు రావు కూడా గతంలో ఇలాంటిదే ఓ ప్రాజెక్ట్‌ చేసి అందిరిచేత శభాష్‌ అనిపించుకున్నాడు.

చెత్తతో కరెంట్‌ తయారు చేసే ఓ మెషీన్‌ మోడల్‌ను తన ప్రాజెక్ట్‌లో భాగంగా తయారు చేశాడు. అప్పుడు కూడా అంతా ఇలాగే హిమాన్షును మెచ్చుకున్నారు. అప్పట్లో ఓ స్కూల్‌కు కూడా డొనేషన్‌ ఇచ్చిన తన మంచి మనసు చాటుకున్నాడు హిమాన్షు. ఇప్పుడు అలేఖ్య కూడా తన తండ్రి గర్వపడేలా తన ప్రాజెక్ట్‌ వర్క్‌తో అందని మన్ననలు పొందింది. దీంతో కేటీఆర్‌ వారసత్వాన్ని తన పిల్లలిద్దరూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారంటూ అంతా మెచ్చుకుంటున్నారు.