KTR BLOOD DONATION: నవంబర్ 29.. దీక్షా దివస్. కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన రోజు. దీక్షా దివస్ సందర్భంగా రాష్ట్రమంతటా బీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు జరుపుకోవాలని కోరారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందులో భాగంగా ఆయన తెలంగాణ భవన్‌లో బుధవారం రక్తం దానమిచ్చారు. అయితే ఇక్కటే ఓ ట్విస్ట్ ఉంది. కేటీఆర్ డయాబెటిస్ పేషెంట్ కదా.. మరి రక్తాన్ని ఎలా దానం చేశాడబ్బా..? దీనిపై ఆయన అభిమానుల్లో పెద్ద చర్చ జరుగుతుంది.
RAIN ALERT: తెలంగాణకు తుఫాన్ ముప్పు.. 4 రోజులు వానలే వానలు..
తాను డయాబెటిక్ అనీ.. తనకు చాలా త్వరగా షుగర్ వచ్చిందని గతంలో కేటీఆరే స్వయంగా చెప్పారు. గత ఏడాది సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ-హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏజెంట్ ఆరోగ్య పరీక్షలు చేయిస్తే షుగర్ బయటపడిందని చెప్పారు. డౌట్ వచ్చి మళ్ళీ పరీక్షలు చేయించుకుంటే.. షుగర్ అని తేలిందన్నారు. అప్పటిదాకా తనకు ఆ వ్యాధి వచ్చినట్టే తెలియదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ రక్తదానం చేసినప్పుడు టీవీల్లో చూసిన చాలామందికి ఇదే డౌట్ వచ్చింది. షుగర్ వ్యాధిగ్రస్తులు చాలామంది రక్తదానం చేయరు. కానీ కేటీఆర్ తొందర పడ్డారా..? లేక తెలియక రక్తదానం చేశారా? లేక తాను డయాబెటిక్ అని గతంలో సరదాగా అబద్ధం చెప్పారా..? ఇదే విషయం చాలామంది చర్చించుకుంటున్నారు. అసలు డయాబెటిస్ పేషెంట్లు రక్తదానం చేయొచ్చా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే వీళ్ళు రక్తదానం చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు డాక్టర్లు.
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ రోగులు.. ఎవరైనా సరే.. రక్తదానం చేయవచ్చు. ఇక్కడ బ్లడ్ ఇచ్చేవాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే మధుమేహం పూర్తిగా అదుపులో ఉంచుకుంటూ.. ఇతర ఏ వ్యాధులు లేని వారు డాక్టర్లను సంప్రదించి రక్తదానం చేయొచ్చు. బ్లడ్ ఇచ్చే ముందు డయాబెటిస్ రోగులు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. గుండె జబ్బులు లేదా ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు ఉన్న షుగర్ పేషెంట్స్ రక్తదానం చేయడం మంచిది కాదు. బ్లడ్ డొనేషన్ తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.