రాజకీయాల్లో కొందరు నేతలు నిత్యం వార్తల్లో నిలవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం కొందరు నేతలు నోటి దురుసును ప్రదర్శిస్తారు. అలాంటి కోవలోకే వస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తండ్రి కేసీఆర్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు కేటీఆర్. 2009లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దులో అనర్గళంగా మాట్లాడుతారు. తెలంగాణ రాజకీయాల్లో తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకోవాలి. కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రాలు అందిస్తున్నాడు. ప్రత్యర్థులను ఎరగా మార్చుకోవాల్సిన కేటీఆరే…మరొకరికి గేలానికి చిక్కుతున్నాడు. వివాదాలకు దూరంగా ఉండాల్సింది పోయి…తానే బాధ్యతారహిత్యంగా కామెంట్లు చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. పార్టీలో నేతలు అదుపు తప్పితే…మందలించాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ మాట తూలుతున్నాడు. ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొనే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు.
కొండా సురేఖను బీఆర్ఎస్ సోషల్ మీడియా…దారుణంగా ట్రోలింగ్ చేసింది. నోటి చెప్పలేని విధంగా…కళ్లతో చూడలేని విధంగా పోస్టులు పెట్టింది. ఆ పోస్టులను వైరల్ చేసింది. దీంతో మనసు నొచ్చుకున్న కొండా సురేఖ…తన ఆవేదనను బహిరంగంగానే తెలియజేసింది. దీనిపై సంయమనం వ్యవహరించాల్సిన కేటీఆర్…మీరు బూతులు మాట్లాడలేదా అంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే పోస్టులకు తనకేం సంబంధమంటూ కఠువుగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో దుమారం మొదలైంది. మహిళలంటే గౌరవం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ…కేటీఆర్ పై ప్రత్యర్థులు అదుపు తప్పి వ్యవహరిస్తున్నారు. అధికార కోల్పోయాయమన్న బాధ ఎవరికైనా ఉంటుంది. కానీ ఓటమి ఎదురైనపుడు నేతలు ఓపికతో వ్యవహరిస్తారు. ఓటమి నుంచి విజయానికి కావాల్సిన పాఠాలు నేర్చుకుంటారు. కానీ కేటీఆర్ మాత్రం…ఓటమి ఫ్రస్టేషన్ లో ఇంకా ఇంకా తప్పులు చేస్తున్నాడు.
కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే తొలిసారి కాదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం…ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కామన్ గా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. దీన్ని సమర్థించాల్సింది పోయి…అహంకారపూరితంగా మాట్లాడాడు. .రాష్ట్రంలో మనిషికో బస్సులు వేస్తే…కుటుంబాలకు కుటుంబాలే…ఆ బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని అన్నాడు. దీనిపై మహిళలు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు. మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించాడు. నా అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని ట్వీట్ చేశారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వడంటున్న కాంగ్రెస్…..50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం పీకారు అంటూ పరుష పదజాలం ప్రయోగించారు. బరాబర్ మాది కుటుంబ పాలనే అంటూ రెచ్చిపోయారు. అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపైన నోరాజారడు. అదానీకి దేవుడు కావచ్చేమో కానీ…తెలంగాణకు పట్టిన శని అంటూ కామెంట్లు చేశాడు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపైనా, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని…గతంలో వాడు.. వీడు అంటూ సంబోధించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో అయితే…తెలంగాణ ప్రజల కంటే కూడా ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్లతో పోల్చాడు. ఆంధ్రా ప్రజలు చైతన్యవంతులు కాబట్టే సరైన నిర్ణయం తీసుకున్నారని…తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించాడు. తెల్లారి లెగిస్తే మొరుగుడు..విచిత్ర జంతువుల్లా విచిత్ర అరుపులు అంటూ…అప్పట్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి కామంట్స్ చేశాడు. అక్కడితో ఆగని కేటీఆర్…డ్రగ్స్ ఏందీ…టెస్ట్ ఏందీ…ఇచ్చాక చెప్పు తీసుకొని కొడతా పడతాడా…చిత్తశుద్దితో బయటకు వస్తా…కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా అంటూ బండి సంజయ్ పై రెచ్చిపోయాడు.