రేవంత్ నీ కళ్ళు సల్లబడవా…?

హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టటం మూర్ఖపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలాదా? ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారా? అని నిలదీశారు.

  • Written By:
  • Publish Date - November 2, 2024 / 05:59 PM IST

హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టటం మూర్ఖపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలాదా? ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారా? అని నిలదీశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమేమిటి? అని ప్రశ్నించారు. బిల్డర్ల నుంచి స్వ్కేర్ ఫీట్ కు, పేద, మధ్యతరగతి ప్రజల నుంచి చదరపు గజానికి వసూళ్లా? ఎవరో చేసిన తప్పునకు ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లను బాధితులు చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జీపీ లే అవుట్లు వందలాదిగా వెలిశాయన్నారు. అప్పట్లో అనుమతించి ఇప్పుడు కాదంటే ప్లాట్లు కొన్న వాళ్లు ఏమై పోవాలి? పేద, మధ్య తరగతి ప్రజలంటే రేవంత్ రెడ్డి కి ఎందుకంత కోపం? అంటూ కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏమాత్రం పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పరిపాలన అనుభవం లేకుండా తుగ్లక్ ను తలపించేలా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.