రేవంత్ బయటకు పోకు, తంతారు: కెటిఆర్

ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకొలే అంటూ ఆవేదన వ్యక్తం చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.

  • Written By:
  • Publish Date - November 5, 2024 / 03:13 PM IST

ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకొలే అంటూ ఆవేదన వ్యక్తం చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. కెసిఆర్ హయాంలో రోజుకు దాదాపు 2 వేలు సంపాదించే పరిస్థితి ఉండేదని ఆటో డ్రైవర్లు చెప్పారని ఇప్పుడు 2 నుంచి 3 వందలు కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చిందని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారన్నారు. గతేడాది రాహుల్ గాంధీ వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ల సమస్యలు తీరుస్తానని రంగుల కల చూపించారన్న ఆయన ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకొలే అంటూ కామెంట్స్ చేసారు.

ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న నెలకు వెయ్యితో పాటు రూ. 5 వేలు నెలకు ఇవ్వాలని కోరుతున్నాను అని డిమాండ్ చేసారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు చాలా హామీలు ఇచ్చి…మీ నోట్లో మట్టి కొట్టిందని పోలీసులు డ్యూటీ లు చేయండి. కానీ పేద వాళ్ల పట్ల దయతో ఉండండని సూచించారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రేవంత్ రెడ్డి ని తన్నే పరిస్థితి ఉంది. అందుకే ఆయనకు భయం పట్టుకుందన్నారు.

నల్గొండ లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ నాయకుడే మనం బయటకు వెళితే తన్నే పరిస్థితి ఉందని చెప్పాడు. మనం ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని చెప్పాడని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డికి పోలీసుల మీద కూడా నమ్మకం లేక సెక్యూరిటీలో నుంచి బెటాలియన్ పోలీసులను తీసేశారన్నారు. మార్పు, మార్పు అనుకుంటూ అందరి కొంపలు పుచ్చుకున్నారు ఈ కాంగ్రెసోళ్లని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలలు అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా సరే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడతామన్నారు.