జన్వాడ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రేవ్ పార్టీ జరిగిన బిల్డింగ్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పేరు మీద ఉండటం.. పార్టీలో కేటీఆర్ కూడా ఉన్నాడు అనే ఆరోపణలు రావడంతో ఇప్పుడు స్టేట్‌వైడ్‌గా ఆ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. జన్వాడలోని ఈ ఫాంహౌజ్‌లో పార్టీ జరుగుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా SOT పోలీసులు తెలుసుకున్నారు. స్థానికుల సమాచారంలో పార్టీ జరుగుతుండగానే అక్కడికి వచ్చారు. పార్టీలో అనుమతి లేకుండా తీసుకువచ్చిన విదేశీ మద్యాన్ని గుర్తించారు. కొకైన్ కూడా పార్టీలో వాడినట్టు గుర్తించారు. కేటీఆర్ సన్నిహితుడు విజయ్‌కి కొకైన్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందని పోలీసులంటున్నారు.
ఇక్కడ అన్నికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే.. పార్టీలో కేటీఆర్ కూడా ఉన్నాడు అని. పోలీసులు వచ్చే కాసేపటి క్రితమే కేటీఆర్ పార్టీ నుంచి వెళ్లిపోయాడని స్థానికులు చెప్తున్నారు. తరచుగా కేటీఆర్ ఇక్కడికి వస్తుంటాడని పార్టీలు చేసుకుంటాడని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు కాస్త ముందుగా వస్తే కేటీఆర్ కూడా ఉండేవారని చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇప్పుడు ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్‌ను ఆడుకుంటున్నారు. రాష్ట్రానికి కేటీఆర్ ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. జన్వాడలో ఉన్న ఈ 30 ఎకరాల ఈ ఫాంహౌజ్ చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఇది కేటీఆర్ ఆక్రమంగా సంపాదించాడంటూ కాంగ్రెస్ నేతలు చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు. FTL పరిధిలో ఈ ఫాంహౌజ్ ఉందని రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపణ చేశారు. కేటీఆర్ ఈ ఆరోపణలకు కౌంటర్ కూడా ఇచ్చారు. ఫాంహౌజ్ తనదేనని నిరూపిస్తే దగ్గరుండి కూల్చే బాధ్యత తనదంటూ చెప్పారు. కానీ ఇప్పుడు స్వయంగా కేటీఆర్ బావమరిది, అత్యంత సన్నిహితులంతా ఇదే ఫాంహౌజ్‌లో పార్టీ చేసుకుంటూ దొరికారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎలా డిఫెండ్ చేస్తుందో చూడాలి.