KTR: నేను రాలేను.. ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్.. అసలు కారణం ఇదే..

కేటీఆర్‌ ఎప్పటికప్పుడు తండ్రి ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ అన్నీ తానై చూసుకుంటున్నారు. తన తండ్రి హాస్పిటల్‌లో ఉన్న కారణంగానే తాను అసెంబ్లీకి రాలేకపోతున్నానంటూ అసెంబ్లీ సెక్రెటరీకి లేఖ రాశారు కేటీఆర్‌.

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 02:21 PM IST

KTR: ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ.. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. వాళ్లతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా అసెంబ్లీకి రాలేదు. రీసెంట్‌గా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ ప్రమాదానికి గురయ్యారు.

Assembly meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ..

బాత్‌రూంకు వెళ్తున్న సమయంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన ఎడమ తొంటికి తీవ్రగాయమైంది. వెంటనే యశోద హాస్పిటల్‌కు కేసీఆర్‌ను తరలించడంతో.. ఆయనకు ఆపరేషన్‌ చేయాల్సిన అవసరముందని డాక్టర్లు చెప్పారు. అన్ని టెస్ట్‌లు పూర్తైన తరువాత ఆయనకు ఆపరేషన్‌ చేశారు. రెండు నెలల పాటు ఆయనకు బెడ్‌ రెస్ట్‌ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. దీంతో రెండు నెలలపాటు ఆయన అసెంబ్లీకి వచ్చే ఛాన్స్‌ లేదు. ఇక కేటీఆర్‌ ఎప్పటికప్పుడు తండ్రి ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ అన్నీ తానై చూసుకుంటున్నారు. తన తండ్రి హాస్పిటల్‌లో ఉన్న కారణంగానే తాను అసెంబ్లీకి రాలేకపోతున్నానంటూ అసెంబ్లీ సెక్రెటరీకి లేఖ రాశారు కేటీఆర్‌. ప్రమాణస్వీకారానికి మరో తేదీ ఇవ్వాలంటూ కోరారు. కేటీఆర్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ప్రమాణస్వీకారం చేయలేదు. వాళ్లందరి ప్రమాణస్వీకారానికి మరో తేదీ కేటాయించబోతున్నారు అసెంబ్లీ స్పీకర్‌.

మొన్నటి వరకూ అధికారపక్షంలో ఉన్న కేటీఆర్‌ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతారు.. ఎలా మాట్లాడతారు.. అని బీఆర్ఎస్‌ కార్యకర్తలతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కేటీఆర్‌ ఎప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తారు.. ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతారో చూడాలి.