సురేఖపై కేటిఆర్ పిటీషన్, నేడే విచారణ

మంత్రి కొండ సురేఖ పై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరపనుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ దావా పిటిషన్ ను కేటిఆర్ దాఖలు చేసారు. నేడు పిటిషన్ పై నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారణ జరపనుంది.

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 01:00 PM IST

మంత్రి కొండ సురేఖ పై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరపనుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ దావా పిటిషన్ ను కేటిఆర్ దాఖలు చేసారు. నేడు పిటిషన్ పై నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారణ జరపనుంది. బిఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ ను సాక్షులుగా కేటీఆర్ పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని కెటిఆర్ పిటిషన్‌ లో కోరారు.

2014-2023 వరకూ ముఖ్యమంత్రి కెసిఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశానని 5 సార్లు వరుసగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నానని 9 ఏళ్లు మంత్రిగా పనిచేశానని పిటీషన్ లో ఆయన వివరించారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ పార్టికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నానని తెలిపారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను. మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేసానని ఆయన వివరించారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పనిచేసినట్టు కేటిఆర్ పేర్కొన్నారు.

తెలంగాణా వేగంగా అభివృద్ది చెందడంలో కృషి చేశానన్నారు. మంత్రి వాఖ్యలు తన పరువుకు తీవ్ర నష్టం చేకూర్చాయని పిటీషన్ లో ఆవేదన వ్యక్తం చేసారు. కొండా సురేఖ మాట్లాడిన వీడియో, ఆడియో టేపులను కోర్టుకు కేటీఆర్ న్యాయవాదులు సమర్పించారు. బీఎన్ఎస్ యాక్ట్ 356 సెక్షన్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని కోరారు. 23రకాల ఆధారాలను కోర్టుకు న్యాయవాదులు సమర్పించారు. నేడు పిటిషన్ పై విచారణ జరగనుంది.