KTR – Harish: ఇంతలోనే ఎంత మార్పు..? కేటీఆర్ కమ్మ భజన..! హరీష్ బాబు భజన..!!

ఎన్నికల్లో ఎన్ని కళలో... ఒక్క ఓటుకై ఎన్ని వలలో అని వెనకటికి ఓ కవి రాసినట్లుగా టిఆర్ఎస్ నాయకులు తమకు అలవాటైన విద్యనే మళ్లీ మళ్లీ ప్రదర్శిస్తూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా కావలించుకుని ముద్దాడే కెసిఆర్ వారసులు ఇప్పుడు మళ్లీ అదే స్టైల్ మొదలుపెట్టారు.

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 03:05 PM IST

మూడు రోజుల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడ్డాడు. అసలు ఇక్కడ మీకు హైదరాబాదులో ఏం పని అంటూ తెలంగాణ అంతా బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఐటి ఉద్యోగులు సైబర్ సిటీలోనూ… రహేజా పార్క్ లోను ధర్నాలు చేస్తే హైదరాబాదులో ఇలాంటివి చేయకూడదు అంటూ… ఎవరికి అనుమతి ఇవ్వబోమంటూ హెచ్చరించాడు కేటీఆర్. నిరసన ర్యాలీలకు అనుమతి ఇవ్వాలంటూ లోకేష్ తనకి ఫోన్ చేశాడని.. శాంతి భద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇవ్వలేదంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీనిపై తెలంగాణలోని సీమాంధ్రులలో చాలా నిరసన వచ్చింది. కేవలం కమ్మ వాళ్ళే కాదు మిగిలిన ఆంధ్ర కులాల వాళ్లు కూడా కేటీఆర్ అహంకారపు ప్రేలాపనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ధర్నా చేసుకుంటే నీకేమి నొప్పని ప్రశ్నించారు. మీరు మహారాష్ట్రలోనూ, ఆంధ్రాలో సభలు సమావేశాలు పెట్టుకోవడం లేదా అని తిట్టి పోశారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అయితే కేటీఆర్ ని మాటలతో ఆడుకున్నాడు. కేవలం సీమాంధ్రులే కాదు తెలంగాణ వాళ్లు కూడా తప్పు పట్టారు. దీంతో ఒక్కసారిగా బి ఆర్ ఎస్ నాయకులు నాలిక కరుచుకున్నారు.

ఎన్నికల ముందు అనవసరంగా సీమాంధ్రతో గోక్కున్నామని అర్థమైంది. వెంటనే డామేజ్ కంట్రోల్ కి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కేటీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ నీ ఆకాశానికి ఎత్తేశారు. ప్రపంచంలో తెలుగు వాళ్లకు గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ అనీ, తన పేరు తారక రామారావు అని పెట్టడం కూడా ఎన్టీఆర్ వల్లేనని చెప్పొకొచ్చారు. ఆ పేరు పుణ్యం వల్లే తాను రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని ఎవరు ఊహించని రీతిలో ఎన్టీఆర్ భజన చేశారు.

అటు మెదక్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. ఈ వయసులో చంద్రబాబుని అరెస్టు చేయడం దురదృష్టకరమని.. అలా జరిగి ఉండాల్సింది కాదని హరీష్ అన్నారు. తెలంగాణలో కమ్మ వాళ్ళ ఓట్ల కోసం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం బావాబామ్మర్దులు ఇద్దరు మాట మార్చేశారని జనం అనుకుంటున్నారు. ఎన్నికల్లో ఎన్ని కళలో… ఒక్క ఓటుకై ఎన్ని వలలో అని వెనకటికి ఓ కవి రాసినట్లుగా టిఆర్ఎస్ నాయకులు తమకు అలవాటైన విద్యనే మళ్లీ మళ్లీ ప్రదర్శిస్తూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా కావలించుకుని ముద్దాడే కెసిఆర్ వారసులు ఇప్పుడు మళ్లీ అదే స్టైల్ మొదలుపెట్టారు. చంద్రబాబు అరెస్టుతో మాకు ఏం సంబంధం… ఇక్కడ నిరసన ర్యాలీలు చేయనివ్వం అని స్టేట్మెంట్లు ఇచ్చిన కేటీఆర్ మూడు రోజులు తిరగకుండానే స్వర్గీయ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశారు. ఇది కదా బరితెగించిన రాజకీయం అంటే…!