మూసి ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై మరోసారి రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అక్రమార్కుల కంటికి కునుకు లేకుండా చేస్తా అని స్పష్టం చేసారు. మూసీ దగ్గరికే వచ్చా. సవాలు విసిరిన వాడు ఎక్కడ పోయాడు అని నిలదీశారు. హైడ్రా అనగానే ఈటెల, హరీష్, కేటీఆర్ బయటకి వచ్చారు అని హైడ్రా కి పేదలు ఎవరూ భయపడడం లేదన్నారు. చెరువులు, నాలలు ఆక్రమించుకున్న వాళ్లు భయపడుతున్నారని తెలిపారు.
అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రా కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు అడిగినప్పుడు మీ అనుపతి పత్రాలు చూపించండని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని… ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం అని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు భయపడకండని హామీ ఇచ్చారు. పెద్దలను కట్టడి చేసి పేదలకు పంచుతామన్నారు. నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. మురికిలో మునిగి ఇబ్బందులు పడుతున్నవాళ్ళకి బుల్డోజర్ ఖాళీగా ఉంచాను అని… ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి అని సవాల్ చేసారు.
కేటీఆర్ ఫాం హౌజ్ అక్రమంగా కట్టుకోలేదా పోయి చూద్దాం రండి అని సవాల్ చేసారు సిఎం. అజీజ్ నగర్ లో హరీష్ ఫాం హౌజ్ లేదా? అని నిలదీశారు. చెప్పులు మోసే హరీష్ లాంటివాడితో నాకేం పోటీ? అని నిలదీశారు. నా ఇంటి ముందు వచ్చి చేతులు కట్టుకొని బిచ్చం ఆడుకున్న రోజులు హరీష్ మర్చిపోయాడన్నారు. ఫాం హౌజ్ లో అడ్డం పడుకున్న ఆయన్ని రమ్మను అని సవాల్ చేసారు. తన ఫాం హౌజ్ మీదికి బుల్డోజర్ వస్తుందని కేటీఆర్, హరీష్ భయపడుతున్నాడని హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు అని స్పష్టం చేసారు. పేదలు తాగే నీళ్ళలో డ్రెయినేజీ కలిపే వాళ్ళని చెరువులో తోక్కుతామని హెచ్చరించారు. పోలీసు స్టేషన్ కి పిలిచి కొందర్ని బట్టలిప్పి కొట్టాలి కానీ వదిలేశామన్నారు.