మీ ఇద్దరి డ్రామా: కేటిఆర్ సంచలనం

గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి కేటిఆర్ ఆరోపించారు. గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం అని మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - October 19, 2024 / 07:10 PM IST

గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి కేటిఆర్ ఆరోపించారు. గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం అని మండిపడ్డారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు అని తెలిపారు ఆయన. కనీసం సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలని సూచించారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి కావాలనే ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు.

బండి సంజయ్ ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి ర్యాలీ చేయిస్తాడు రేవంత్ అంటూ ఆరోపించారు. మా నాయకులను అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని నిలదీశారు. బండి సంజయ్ ఏం చదువుకున్నాడు ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. పరీక్ష పత్రాలు లీక్ చేయమంటే చేస్తాడు… అభ్యర్థుల తరఫున ఆయనేం చర్చిస్తారు అని నిలదీశారు.