KTR: లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ధం కండి.. పార్టీ నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల‌ని, అసెంబ్లీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు మాజీ మంత్రి కేటీఆర్.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 07:28 PM IST

KTR: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల‌ని, అసెంబ్లీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు మాజీ మంత్రి కేటీఆర్. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సోమవారం కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో లోక్‌సభ ఎన్నికలపై చర్చించారు. కీలక సూచనలు చేశారు.

PAWAN KALYAN: అయ్యో పవన్ ! డిప్యూటీగా కూడా పనికిరాడా..? జనసేనాని పరువు తీస్తున్న లోకేష్

“అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మితో కుంగిపోవ‌ద్ద‌ు. ప‌రాజ‌యం చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌లు. వారు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేతలతో సమన్వయం చేసుకుని, విస్తృతంగా ప‌ర్య‌టించాలి. జ‌న‌వ‌రి 26లోగా స‌మావేశాలు పూర్తి చేసుకోవాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సుమారు 98 వేల ఓట్ల లీడ్ ఉంది. అదే స్థాయిలో, అంతే స్ఫూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలి” అని కేటీఆర్ సూచించారు. సమావేశం అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌ను వచ్చే ఎన్నికల్లో కూడా చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌మ‌ని కేటీఆర్ చెప్పినట్లు వెల్లడించారు.

గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంద‌ని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ హాజరయ్యారు.