KTR: మెడికల్ కాలేజీల బదులు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుంటే గెలిచేవాళ్లం: కేటీఆర్

కేటీఆర్.. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆదివారం ట్వీట్ చేశారు. "ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆసక్తికర ఫీడ్ బ్యాక్ వస్తోంది.

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 07:32 PM IST

KTR: తమ ప్రభుత్వం 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు.. 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుంటే మళ్లీ గెలిచే వాళ్లమని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సలహా పలువురు నెటిజన్ల నుంచి వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. కేటీఆర్.. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆదివారం ట్వీట్ చేశారు.

TTD: శ్రీవారి దర్శనం.. జనవరి 2 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..

“ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆసక్తికర ఫీడ్ బ్యాక్ వస్తోంది. అందులో బాగా నచ్చింది ఒకటుంది. కేసీఆర్.. 32 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసే బదులు.. 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుంటే బాగుండేది. తప్పుడు, దుష్ప్రచారాన్ని అడ్డుకునే వాళ్లం” అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు కేటీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తుంటే.. ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఓటమి నుంచి కేటీఆర్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని, ప్రతిపక్షంగా ప్రజల కోసం పాటుపడాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో చర్చకు కారణమైంది.