హరీష్ కోసం భారీ కేటిఆర్ త్యాగం… న్యూ ఇయర్ సెన్సేషన్ ఇదే

టిఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలక పరిణామాలకు రంగం సిద్ధం అయిందా? ఇన్నాళ్ళు పార్టీని భుజాన మోసిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నారా? పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలంటే సమస్యలు ఉండకూడదు అనే భావనలో కేటీఆర్ ఉన్నారా?

  • Written By:
  • Publish Date - December 30, 2024 / 08:14 PM IST

టిఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలక పరిణామాలకు రంగం సిద్ధం అయిందా? ఇన్నాళ్ళు పార్టీని భుజాన మోసిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నారా? పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలంటే సమస్యలు ఉండకూడదు అనే భావనలో కేటీఆర్ ఉన్నారా? ఇన్నాళ్ళు పార్టీలో తానే కర్త కర్మ క్రియ అని భావించిన కేటీఆర్ వాస్తవం అర్థం చేసుకున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ప్రభుత్వం పై గట్టిగానే పోరాటం చేస్తోంది.

కానీ ఎక్కడో ఏదో తెలియని లోపం కనబడుతోంది. ఆ లోపమే కేసీఆర్… ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పోరాడాల్సిన సమయంలో ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ క్లారిటీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్.. ఉద్యమ రాజకీయాలను స్వయంగా చూసి… దేశంలోనే పాపులర్ అయిన కేసీఆర్… ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పోరాడటానికి ఆరోగ్య సమస్యలతో ఇగోతో బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. తన కుర్చీలో తను కలలో కూడా ఊహించని వ్యక్తి కూర్చోవడాన్ని కేసీఆర్ అసలు భరించలేకపోతున్నారు.

అందుకే శాసన సభా సమావేశాలకు కూడా హాజరయ్యేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు హాజరయ్యారు. కేటీఆర్… హరీష్ రావు లేదంటే ఇతర పార్టీ నేతలే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇక కేటీఆర్ పై కేసు నమోదు అయిన సమయంలో ఆయన బయటకు వస్తారని పెద్ద చేర్చే జరిగింది. కానీ అసలు ఇప్పటివరకు కేసీఆర్ నుంచి ఒక్క మీడియా సమావేశం కూడా లేదు. కేసీఆర్ మీడియాతో మాట్లాడితే ఆ రేంజ్ వేరు.. ఆ సందడి వేరు.. ఆ హడావుడి వేరు.

నేషనల్ మీడియా కూడా కెసిఆర్ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కౌంటర్లు, సెటైర్లు ఇలా ఎన్నో ఆయన ప్రసంగంలో ఉంటాయి. అలాంటి కేసీఆర్ ఇలా మౌనంగా ఉండటంతో మీడియా కూడా కాస్త తెలంగాణలో సరైన సందడి కోసం ఎదురుచూస్తోంది. ఇక ఇప్పుడు కేసీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. శాసనసభ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడం అలాగే ప్రభుత్వంపై పోరాటం చేసే పరిస్థితిలో కేసీఆర్ లేకపోవడం వంటివి ఆ పార్టీని మానసికంగా దెబ్బతీస్తున్నాయి.

అందుకే ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకొని తన గురించి మీడియాలో చర్చలు లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా కేసీఆర్ రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనితో పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరు అనేదానిపై పెద్ద చర్చే మొదలైంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. అధ్యక్షుడిగా కెసిఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలోకి కేటీఆర్ వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు.

కానీ కెసిఆర్ స్థానంలో హరీష్ రావు భారత రాష్ట్ర సమితిని నడిపించనున్నారు. వాస్తవానికి హరీష్ రావు ప్రభుత్వంలో అప్పట్లో కాస్త కంఫర్టబుల్ గా కనపడలేదు. ఆయనను పక్కనపెట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని భావించినట్లు అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇక హరీష్ రావు కూడా కేసీఆర్ తో అలాగే కేటీఆర్ దూరం పాటిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. సీనియర్ నేతలు అందరూ హరీష్ రావుతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. ఇది నచ్చని కేటీఆర్… హరీష్ రావును పక్కన పెట్టే ప్రయత్నం చేశారని వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పుడు హరీష్ రావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కొనసాగాలని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే హరీష్ నుంచి ఇబ్బందులు ఉండవద్దని… ఆయన ఇగోని కూడా సాటిస్ఫై చేయడానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదులుకుంటే మంచిది అనే ఒపీనియన్ లో కేటీఆర్ ఉన్నారట. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి పై హరీష్ రావుకి పట్టు ఎక్కువ.

కేటీఆర్ తో పోలిస్తే హరీష్ కు పార్టీ సీనియర్ నేతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కెసిఆర్ తో సన్నిహితంగా ఉండే వాళ్ళు అందరితో హరీష్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకరకంగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హరీష్ కు ప్రాధాన్యత లేదు… అనే ఆవేదన ఆయనతో సన్నిహితంగా ఉండే నేతల్లో ఎక్కువగా ఉండేది. ఇక కెసిఆర్ కూడా హరీష్ ను చాలా బాగా చూసుకుంటారు అనేది చాలామందిలో ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచారు హరీష్ రావు. కేసీఆర్ అన్ని నిర్ణయాల్లో హరీష్ రావు భాగస్వామ్యం ఉండేది.

ఉద్యమ సమయంలో అలాగే ఏదైనా ప్రధాన పార్టీలకు మద్దతు ఇచ్చే సమయంలో హరీష్ రావు నిర్ణయాలకు… హరీష్ రావు అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. అయితే కేటీఆర్ వచ్చిన తర్వాత మాత్రం అన్ని విషయాల్లో హరీష్ కు ప్రాధాన్యత తగ్గింది అనే ఒపీనియన్ కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ హరీష్ ను పక్కన పెట్టడం కంటే నెత్తిన పెట్టుకోవడం మంచిది అనే భావిస్తున్నట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. వాస్తవానికి కేటీఆర్ అరెస్టు అయితే బిఆర్ఎస్ మానసిక పరిస్థితి కచ్చితంగా ప్రభావితం అవుతుంది.

ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు కాడి వదిలేసినా ఆశ్చర్యం లేదు. ఈ సమయంలో హరీష్ రావు సహకారం అనేది చాలా ముఖ్యం కానుంది. కాబట్టి ఆయనను పార్టీ అధ్యక్షుడుగా నియమిస్తే సమస్యలు ఉండవు అనే భావనలో కేటీఆర్ ఉన్నారు. ఒకవేళ తాను జైలుకు వెళ్లినా సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడు హోదాలో సమర్థవంతంగా నడిపించగలిగే సత్తా హరీష్ రావుకు ఉందని కేటీఆర్ భావిస్తున్నారు. తాజాగా 2025లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తుంటే ఖచ్చితంగా హరీష్ రావు ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా లాంఛనమే అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

పార్టీ అధ్యక్ష బాధ్యతల అప్పగిస్తే హరీష్ మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యమ సమయంలో కూడా ఆయన దూకుడుగానే ఉండేవారు. ఆ దూకుడుని మరోసారి హరీష్ ప్రదర్శించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే మాత్రం కచ్చితంగా కేటీఆర్ కు కలిసి వస్తుంది. హరీష్ తో దూరం కంటే కంటే సమన్వయమే ఇప్పుడు కేటీఆర్ అత్యంత ముఖ్యం. కాబట్టి పార్టీ అధ్యక్ష పదవి కోసం కక్కుర్తి పడకుండా వదులుకోవడమే మంచిది అని అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.