KTR: మిస్‌ యు హిమాన్షు.. కొడుకును తలచుకుని కేటీఆర్ ట్వీట్..!

ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది ఆగస్టులో హిమాన్షు అమెరికా వెళ్లగా.. ఇప్పుడు కేటీఆర్ ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి కొడుకును గుర్తు చేసుకున్నాడు. హిమాన్షుతో కలిసి నడుస్తున్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. మిస్సింగ్ దిస్ కిడ్‌ అనే క్యాప్షన్‌ను జోడించారు.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 02:48 PM IST

KTR: ఎన్నికల వేళ.. తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు మంత్రి కేటీఆర్. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌.. తనయుడు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది ఆగస్టులో హిమాన్షు అమెరికా వెళ్లగా.. ఇప్పుడు కేటీఆర్ ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి కొడుకును గుర్తు చేసుకున్నాడు. హిమాన్షుతో కలిసి నడుస్తున్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. మిస్సింగ్ దిస్ కిడ్‌ అనే క్యాప్షన్‌ను జోడించారు. క్యాప్షన్‌ పక్కనే లవ్‌ సింబల్‌ను కూడా జత చేశారు.

గ‌చ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంట‌ర్నేష‌న్ స్కూల్‌లో హిమాన్షు ఇంటర్మీడియట్‌ను పూర్తి చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల్లో పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత సీఎం కేసీఆర్, నాయనమ్మ శోభ, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్య కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఆగస్టులో అమెరికా వెళ్లారు. మంత్రి కేటీఆర్ దంపతులు స్వయంగా యూఎస్ వెళ్లి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. అప్పుడు కూడా మంత్రి కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. ”నిన్నమెున్నటి వరకు అల్లరిగా తిరిగిన పిల్లాడు అప్పుడే పెద్దయి కాలేజీకి వెళ్తున్నాడంటే.. నమ్మలేకపోతున్నా. హిమాన్షు ఒంటరిగా అమెరికా వెళ్లటం లేదు. నాలోని సగ భాగాన్ని తీసుకెళ్తున్నాడు” అని కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యాడు.

కేటీఆర్ ట్వీట్‌కు హిమాన్షు ఇచ్చిన రిప్లై.. మనసును మరింత మెలేస్తోంది. ఇంటిక దూరంగా ఉండి.. వర్చువల్‌గా చూసుకోవడం అంటే ఇబ్బందిగా ఉందని.. ఐతే సక్సెస్‌ కావాలంటే కొన్నింటిని త్యాగం చేయాలన్న మీ మాటలు ఎప్పుడూ స్ఫూర్తి నింపుతాయని అంటూ.. కేటీఆర్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాడు హిమాన్షు. కొద్దిరోజుల కింద కూడా హిమాన్షు ఇలాంటి పోస్టే పెట్టాడు. ఫ్యామిలీ ఫొటో పెట్టి.. అందరినీ మిస్ అవుతున్నానని.. ముఖ్యంగా తాతను మిస్ అవుతున్నానంటూ రాసుకొచ్చాడు. కేసీఆర్‌, హిమాన్షు ట్వీట్లను అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు రీట్వీట్ చేస్తున్నారు. పిల్లలను వదిలేసి ఉండటం తల్లిదండ్రులకు చాలా కష్టమైన పని అంటూ కామెంట్లు పెడుతున్నారు.