YS SHARMILA: ఏపీ పీసీసీ పగ్గాలు అందుకున్న షర్మిల.. దూకుడు మీద కనిపిస్తున్నారు. జగన్ మీద సెటైర్లు.. టీడీపీని నిలదీస్తున్న తీరు.. హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలో ఉండి జనాలకు పిలుపునివ్వడం కాదు.. జనాల్లో జనంలా ఉండి పార్టీని స్ట్రాంగ్ చేద్దాం అన్నట్లుగా షర్మిల అడుగులు కనిపిస్తున్నాయ్. జనాలను ఆప్యాయంగా పలకరించడం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఇవన్నీ అందుకేనేమో అనిపిస్తోంది ప్రతీ ఒక్కరికి!
YSRCP: ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు.. పాత జాబితాల్లో మార్పులు..?
ఇదంతా ఎలా ఉన్నా.. షర్మిలను వెనక ఉండి నడిపిస్తోంది ఎవరు అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు ప్రతీ పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ షర్మిలపై పరోక్షంగా కామెంట్లు గుప్పించడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఐతే షర్మిల వెనక ఉన్న బలం గురించి.. ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. వైఎస్‌కు అత్యంత ఆప్తుడు.. ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావే షర్మిలను వెనక నుంచి నడిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరవెనక వ్యూహాలను అమలు చేసింది కేవీపీనే. ఆయనే అన్ని రకాలుగా కాంగ్రెస్‌కు చేరువయ్యారు. కాంగ్రెస్‌లో ఏ సమస్య వచ్చినా.. రాజశేఖర్ రెడ్డి వరకు వెళ్లకుండా తనే ప్రయత్నించి.. వాటిని పరిష్కరించేవారు కూడా! వైఎస్ పాలనపై దృష్టిపెట్టగా.. కేవీపీ ఇతర కార్యక్రమాలకు, పార్టీలో నేతల వ్యవహారాలు.. వారిని బుజ్జగించడంలాంటి విషయాలపై పనిచేసేవారు. ఇప్పుడు ఏపీలో షర్మిలకు కేవీపీనే కీలకంగా మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో చేరికలు ఇప్పుడు చాలా అవసరం.
పాతకాపులకు నమ్మకం కలగడం.. వారు ఇతర పార్టీల నుంచి వస్తే.. జరిగే లబ్ది వంటి అనేక అంశాలు కీలకంగా ఉన్నాయ్. దీంతో ఎన్నికలకు ముందు షర్మిల అన్ని విషయాలపైనా దృష్టి పెట్టే అవకాశం లేదు. అందువల్ల కేవీపీనే ఆమెకు అన్ని విషయాల్లోనూ చేదోడుగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయ్. కడపలో అహ్మదుల్లాలాంటి నేతలు తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వెనక.. షర్మిల మీద అభిమానం ఎంత కారణమో.. కేవీపీ మీద నమ్మకం కూడా అంతే కారణం అని క్లియర్‌గా అర్థం అవుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉండబోతున్నాయని.. వాటి వెనక కేవీపీ కీలక పాత్ర కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.