Lagadapati Rajagopal: ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత రాజమండ్రిలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన చెప్పిన విషయాల్లో క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా వినిపిస్తోంది. గతం, వర్తమానం, భవిష్యత్.. రాజకీయ ప్రయాణంపై మూడు కాలాల గురించి మూడు ముక్కల్లో క్లారిటీ ఇచ్చారు లగడపాటి. తాను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయబోనని.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. ఇకపై కూడా దూరంగానే ఉంటానని చెప్పుకొచ్చారు. చిరకాల మిత్రులు అయిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలవడానికి మాత్రమే వచ్చానని.. వాళ్లిద్దరు పోటీచేస్తే మద్దతు ఇస్తానని చెప్పారు.
Mamidala Yashaswini Reddy: చెప్పిందంటే చేస్తుందంతే.. మాట నిలబెట్టుకున్న యశస్విని రెడ్డి..
ఇక అటు గత రెండు ఎన్నికల్లో లగడపాటి టీమ్ ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించింది. ఎవరిది అధికారం అన్న దానిపై ప్రకటనలు చేసింది. అవి నిజం అయ్యాయా.. ఉత్తుత్తిగానే మిగిలిపోయాయా అన్న సంగతి పక్కనపెడితే.. ఈసారి కూడా లగడపాటి అలాంటి సర్వేలు చేయిస్తున్నారనే ప్రశ్నలు వినిపించాయ్. దానికి కూడా లగడపాటి క్లారిటీ ఇచ్చారు. గతంలోలా తానేమీ సర్వేలు చేయించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఐతే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారని.. మీడియావాళ్లకే ఓ ప్రశ్న మిగిల్చి వెళ్లిపోయారు లగడపాటి. గతంలో ఏపీలో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య పోటీ ఉండేదని.. ఐతే ఇప్పుడు మాత్రం తమిళనాడు తరహాలో.. ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నడుస్తోందని.. పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే అని చెప్పకనే చెప్పారు. ఐతే ఇప్పుడు ఇదే కొత్త చర్చకు కారణం అవుతోంది. కాంగ్రెస్ ఈసారి కూడా నామమాత్రమే అని లగడపాటి చెప్పకనే చెప్పారా అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో బౌన్స్‌బ్యాక్ కావాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ బ్రాండ్‌తో కోల్పోయిన బలాన్ని.. అదే వైఎస్ బ్రాండ్‌తో తిరిగి తీసుకురావాలని.. షర్మిలను పార్టీలో చేర్చుకుంది. షర్మిలకు పీసీసీ బాధ్యతలు కూడా అప్పగించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీలో అసంతృప్తులు చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే షర్మిల వెంటే తాను అన్నట్లుగా ఆళ్ల ప్రకటన చేశారు. ఇలాంటి సమయంలో పోటీ ప్రాంతీయ పార్టీల మధ్యే తప్ప.. కాంగ్రెస్ ప్రభావం ఉండదు అన్నట్లు లగడపాటి చేసిన కామెంట్లు.. షర్మిలను తీసిపారేసినట్లు వినిపిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నా.. ఇప్పటికిప్పుడు జరగబోయే అద్భుతం ఏదీ లేదు అని ఆయన చెప్పాలనుకున్నారా అనే చర్చ కూడా వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ అంటూ లగడపాటి చెప్పడంతో.. టీడీపీ తరపున ఆయన వకాల్తా పుచ్చుకున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. అందుకే జీవీ, ఉండవల్లిని కలిశారా అన్నది మరికొందరి వాదన.