Lagadapati Rajagopal: లగడపాటి రీ ఎంట్రీ కన్ఫార్మ్‌! ఏ పార్టీలోకి.. పోటీ ఎక్కడ నుంచి..?

గతంలో ఏ ఎన్నికలు అయినా లగడపాటి ఎగ్జిట్‌పోల్స్ కనిపించేవి. ఐతే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రీఎంట్రీకి సంబంధించి పూర్తి స్కెచ్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 04:45 PM IST

Lagadapati Rajagopal: ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌… కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి పాలిటిక్స్‌లోకి వచ్చే విషయంలో చాలారోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు గుడ్‌బై చెప్తానని ప్రకటించిన లగడపాటి.. చెప్పినట్లుగానే ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సర్వేలతో వార్తల్లో నిలిచారు.

గతంలో ఏ ఎన్నికలు అయినా లగడపాటి ఎగ్జిట్‌పోల్స్ కనిపించేవి. ఐతే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రీఎంట్రీకి సంబంధించి పూర్తి స్కెచ్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇటీవల అనుచరుల ఆత్మీయ సమావేశం జరిగింది. త్వరలోనే లగడపాటి తన నిర్ణయం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. లగడపాటి కొత్తగా ఎంట్రీ ఇచ్చే పార్టీ.. పోటీ చేసే స్థానంపైనా నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ఇన్నాళ్లు రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన.. ఈసారి పాలిటిక్స్‌లో కీ రోల్‌ ప్లే చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి రాబోయే ఎన్నికలు.. ఏపీలో మూడు పార్టీలుక చాలా కీలకం. ఇలాంటి సమయంలో లగడపాటి రీఎంట్రీ ఆసక్తి రేపుతోంది. విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతో.. ఆయన ముఖ్య అనుచరులు కొందరు రహస్య సమాలోచనలు చేశారు. లగడపాటి ఏ పార్టీలో ఉన్నా తమకు అభ్యంతరం లేదని.. ఆయనతో పాటే తామంతా ఉంటామని నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఐతే లగడపాటి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉండటం.. ఆయనతో ఉన్న సంబంధాలతో, తమ పార్టీలోకి రావాలని.. విజయవాడ నుంచి పోటీ చేయాలనే సూచనలు అందాయని సమాచారం. పార్టీల పొత్తుల లెక్కల తర్వాతే.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి లగడపాటి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.