దిగ జారిపోయిన లీడర్లు…. వరదలో బురద రాజకీయం

ఆంధ్ర ప్రదేశ్లో లీడర్లను చూస్తే జనానికి జుగుప్స కలుగుతుంది. అసలు అక్కడ రాజకీయం, ఒకరినొకరు తిట్టుకోవడం, వెక్కిరించుకోవడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తప్ప అసలా రాష్ట్రంలో మరింకేం జరగట్లేదనేది అర్థమవుతుంది.

  • Written By:
  • Publish Date - September 6, 2024 / 08:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్లో లీడర్లను చూస్తే జనానికి జుగుప్స కలుగుతుంది. అసలు అక్కడ రాజకీయం, ఒకరినొకరు తిట్టుకోవడం, వెక్కిరించుకోవడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తప్ప అసలా రాష్ట్రంలో మరింకేం జరగట్లేదనేది అర్థమవుతుంది. అకస్మాత్తుగా వచ్చిన వరదలు పది లక్షల మంది జనం, అలోలక్షణ…. అనుకుంటూ కొంప గూడు పోగొట్టుకొని పిల్లాపాపలతో రోడ్డున పడ్డారు. వాళ్లకి సాయం చేయాల్సింది పోయి టిడిపి, వైసిపి అగ్రనేతలు బజారున పడి మాటలు యుద్ధం చేస్తున్నారు. ఎన్నికల అయిపోయినా కూడా వీళ్ళ తీరు మారదా అని జనం అసహ్యించుకుంటున్నారు.

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఉపద్రవాలు, సంక్షోభాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. జనంలో ఉంటారు. అధికారులను అదిలిస్తారు. ఎంతో కొంత పని చేసి చూపెడతారు. దాంతోపాటు భారీగా పబ్లిసిటీ కూడా చేసుకుంటారు. గతంలో చాలా సందర్భాల్లో అది చూసాం. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా…. బాబు విశాఖలో రాత్రి పగలు అధికారులతో కలిసి పనిచేసి వైజాగ్ కి మళ్ళీ దాని పాత రూపం తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా…. ఒకరోజు ఆలస్యంగా నైనా సరే వెంటనే స్పందించి రంగంలోకి దిగారు. తెల్లవారుజాము మూడింటి వరకు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దీన్ని ఎవరు కాదని లేరు. రెండు రోజులు ఆలస్యంగా వరద ప్రాంతానికి వచ్చిన వైసీపీ అధినేత జగన్, సహాయక చర్యలు సరిగ్గా జరగటం లేదంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఇంటికి వరదరాకుండా బుడమేరు గేట్లు ఎత్తేసారని , ఆ నీళ్లన్నీ బెజవాడ సిటీ లోకి వచ్చేసాయని నోటికి వచ్చింది అలా మాట్లాడారు.

జగన్ బైట్

దీనికి కౌంటర్ గా తెలుగుదేశం వాళ్ళు జగన్ ఎద్దేవా చేస్తూ తిట్టడం మొదలుపెట్టారు. ఒకపక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ తగ్గకుండా వైసీపీని, జగన్ని మాటలతో చీల్చి చెండాడారు .

జగన్ వర్సెస్ చంద్రబాబు బైట్స్

ఇంత వరదల్లో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ జనంలోకి రాలేదని వైసీపీలో మరో వర్గం తగులుతుంది. సహ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొకుండా పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాడంటూ ఆరోపణ చేశారు వైసిపి వాళ్ళు. అందుకు బాగానే పవర్ నుంచి రియాక్షన్ వచ్చింది.

రోజా వర్సెస్ పవన్ కళ్యాణ్

ఇక తెలంగాణలో మాత్రం తక్కువ జరిగిందా.? పొలిటికల్ పార్టీలు చేసిన మనుషులు ఎక్కువగా వచ్చాయి. ఖమ్మం మున్నేరు వరదను అంచనా వేయడంలో రేవంత్ సర్కార్ దారుణంగా విఫలమైందంటూ వీఆర్ఎస్ నేతలు చేయడం మొదలుపెట్టారు. అమెరికాలో ఉన్న కేటీఆర్ సీఎం రేవంత్ ని టార్గెట్ చేస్తూ గంటకు ఒక ట్వీట్ వదిలితే, ఫీల్డ్ లో హరీష్ రావు మంత్రుల్ని ఆఫీసర్లను తిట్టడం మొదలు పెట్టారు.
వాళ్ల విమర్శల్ని ఆరోపల్ని అడ్డుకోవడానికి వరదను పరిశీలించే సమయం కన్నా ప్రెస్ మీట్ లు పెట్టి తిరిగి తిట్టడానికే రేవంత్ మిగిలిన మంత్రులు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది.

హరీష్ రావు వర్సెస్ రేవంత్

ఈ మధ్యలో ఖమ్మంలో బి ఆర్ ఎస్ నేతలపై స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వరద రాజకీయం పరమ బురదగా మారింది. జనం నీళ్లలో అష్ట కష్టాలు పడుతుంటే, ఆస్తులు కోల్పోయి… తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోతుంటే లీడర్లు మాత్రం సిగ్గు శరం వదిలేసి… ఒకరి మీద ఒకరు పోటీ ప్రెస్ మీట్ లు పెట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ చెలరేగిపోయారు. అటు చంద్రబాబు సర్కారు గాని, ఇటు రేవంత్ సర్కార్ గాని వరదల్లో జనానికి ఏమీ చేయలేదు అని విమర్శించలేము. ఎంతో కొంత చేశారు. ఇలాంటి కష్ట సమయంలో కూడా పబ్లిసిటీ కోసం పాకులాడారు. కానీ ప్రతిపక్షాలు తాము సహకరించాల్సింది పోయి కేవలం ప్రెస్ మీట్ లకి విమర్శలకి సమయాన్ని అంత పెట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దృష్టి కూడా విమర్శలు పైకి లాగారు. నిజానికి ఏపీలో జగన్ కేవలం కోటి రూపాయలు సహాయం ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజు జీతం ప్రకటించి అదేదో చాలా త్యాగం చేసినట్టు బిల్డప్ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న పార్టీలు జనం కష్టంలో ఉన్నప్పుడు చిల్లర వేస్తుంటే మన ప్రజాస్వామ్యం ఎంత అమానుష పరిస్థితిలో ఉందో అర్థం అవుతుంది. వరద కష్టంలో ఉన్న జనానికి సాయం చేయకపోగా అధికార విపక్ష పార్టీలు ఎంత నీచంగా తిట్టుకోవడం చూసి జనానికి తమ మీద తమకే అసహ్యం వేస్తుంది.