ఆర్జీ కర్ ప్రిన్సిపాల్ కు లై డిటెక్టర్ టెస్ట్…!

కలకత్తా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. ఆరవ రోజు సీబీఐ ముందు విచారణకు ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హాజరు అయ్యాడు.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 04:05 PM IST

కలకత్తా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. ఆరవ రోజు సీబీఐ ముందు విచారణకు ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హాజరు అయ్యాడు. లై డిటెక్టర్ ద్వారా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను విచారించే యోచనలో సిబిఐ ఉందని తెలుస్తోంది. పొంతనలేని సమాధానాలు చెప్పటంతోనే లై డిటెక్టర్ ద్వారా సందీప్ ఘోష్ ను విచారించాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. విధుల్లో అలసత్వం వహించిన ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు.

ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్స్పెక్టర్ పై కలకత్తా పోలీస్ విభాగం ఉన్నతస్థాయి అధికారులు వేటు వేసారు. హత్యాచార బాధితురాలికి మద్దతుగా నిరసన చేస్తున్న డాక్టర్లపై దాడికి పాల్పడిన దుండగులను అడ్డుకోవడంలో విఫలమవటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీస్ ఉన్నత అధికారులు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేసిన పోలీసులు… మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

నిరసనకారుల రూపంలో 40 మంది ఆసుపత్రిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసం పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు… ఆసమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని సుప్రీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సుప్రీం కోర్టు ఆగ్రహం తర్వాత కూడా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు వేసారు.