గోనె ప్రకాశరావు (Gone Prakasa Rao)… ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా… ఆర్టీసీ ఛైర్మన్ (RTC Chairman) గా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ పొలిటికల్ విశ్లేషణలో ఆయనకు ఆయనే సాటి. ఏపీ, తెలంగాణకు సంబంధించి రాజకీయాలను అనర్గళంగా మాట్లాడే వ్యక్తి… గోనె ప్రకాశ్ రావు. ఎన్నికల వేళ భీమవరం రైల్వే స్టేషన్ లో రైలు కోసం పడిగాపులు పడుతున్నారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రైలు కోసమని స్టేషన్ కు వస్తే… రైలు 12 గంటలు ఆలస్యమవుతుందని చెప్పారు. దాంతో ఓ బెంచీ చూసుకొని తన లగేజీని పక్కన పెట్టుకొని పడుకున్నారు. గోనె ప్రకాశ్ రావు ఏంటి… ఇలా సామాన్యుడిలా పడుకున్నారే… అని ఓ వ్యక్తి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి.
ఒకప్పుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ (Independent) గా గెలిచిన గోనె ప్రకాశ్ రావు. తర్వాత రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్ (YSR) హయాంలో ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత… కొన్నాళ్ళు జగన్ వెంట YCP లో కూడా పనిచేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో… పాలిటిక్స్ కి దూరం అయ్యారు. మీడియా ఛానెల్స్, సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నారు. గోనె ప్రకాశ్ రావుకి… అలనాటి నెహ్రూ, ఇందిర టైమ్ నుంచి… ఇప్పటి కేసీఆర్, జగన్ దాకా… ఎవరి గురించి అయినా… రాజకీయ విశ్లేషణ చేయగలరు. అలనాటి సంఘటనలను… సంవత్సరాలు, సంఖ్యలు, అంకెలతో సహా అన్ని విషయాలు సమ్రగంగా చెప్పే నాలెడ్జ్ ఉంది. ఆయన నాలెడ్జెని చూసి పొలిటికల్ లీడర్లే ఆశ్చర్యపోతారు. తానేదో పొలిటికల్ అనలిస్ట్ అని గర్వం లేకుండా… అందరితో కలసిపోతారు. ఎంత ఎదిగినా… ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం కలిగిన గోనె ప్రకాశ్ రావు… ఇలా భీమవరం రైల్వే స్టేషన్ లో సామాన్యుడిగా కనిపించడం ఆశ్చర్యంగానే ఉంటుంది.