లోక్‌సభలో అగంతకుడు దూకిన వ్యవహారం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జీరో అవర్ సమయంలో సభలోకి దూకడంతో పాటు.. కలర్ స్మోక్ విసిరిన దుండగుడి వ్యవహారంపై ఇప్పుడు కొతక్త చర్చ మొదలైంది. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత.. ఎంపీల సీట్ల ముందుగా జంప్ చేస్తూ హంగామా చేశాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కలర్ స్మోక్ తీసి బయటకు విసిరేశాడు. షాక్‌కు గురైన ఎంపీలు.. కొంతమంది వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. ఐతే సభలోనే ఉన్న గోరంట్ మాధవ్.. వెంటనే ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపు ప్రయత్నించిన తర్వాత ఆ దుండగుత పట్టుకున్నాడు. చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మాధవ్‌ను సహచర ఎంపీలు అభినందించారు. గోరంట్ల ఇంత యాక్టివ్‌గా ఉండడానికి.. అంత ధైర్యంగా ఉండడానికి కారణం.. ఆయన ఒకప్పుడు పోలీసు ఆఫీసర్ కావడమే. మాధవ్ మాజీ పోలీసు అధికారి. సీఐగా సర్వీసులో ఉండాగనే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. పోటీ చేసిన మొదటిసారే ఎంపీగా ఎన్నికయ్యారు. వివాదాస్పద ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఆయన.. ఈసారి పార్లమెంట్‌లో ధైర్య సాహసాలు చూపి అందర్నీ ఆకట్టుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఒక వ్యక్తి విజిటర్ గ్యాలరీ నుంచి దూకి ఛాంబర్ లోకి పరిగెత్తడంతో లోక్‌సభలో గందరగోళం తలెత్తింది. ఇద్దరు వ్యక్తులు ఎల్లో కలర్ పొగను వెదజల్లారు. ఒక వ్యక్తిని పట్టుకునేందుకు ఎంపీలు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు దుండగుడు డెస్కులపై నుంచి దూకాడు. ఇక అటు ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. భద్రతా వైఫల్యంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.